VIRAL VIDEO: పసిపిల్లల్లా మారం చేస్తున్న మేక పిల్లలు.. వీడియోకి నెటిజన్ల ఫిదా! ఓ వ్యక్తి మేక పిల్లల పట్ల అమితమైన ప్రేమను పంచుతున్న వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. కొన్ని మేక పిల్లలు ఆ వ్యక్తి ప్రేమ కోసం పరితపించిపోతున్నాయి.. కౌగిలింతల కోసం క్యూ కట్టడం చూపరులను కట్టిపడేస్తోంది. By Vijaya Nimma 24 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి పెంపుడు జంతువులను చాలా మంది ఎంతో ప్రేమగా చూసుకుంటారు. తమ పిల్లలతో సమానంగా పెంచుతుంటారు. సాధారణంగా మన ఇళ్లలో ఎక్కువగా కుక్కలు, పిల్లలను పెంచుతారు, అంతే ప్రేమ కనబరుస్తారు. మేకలు, గొర్రెల వంటివాటిపై ఎక్కువగా ప్రేమ చూపించరు. కేవలం పాకలకే వాటిని పరిమితం చేస్తూ ఉంటారు. అవసరానికి మాత్రమే వినియోగిస్తారు. మాంసం కోసమో లేదా ఇతర అవసరాల కోసమో వాడుకునే వస్తువుల్లా చూస్తుంటారు. Baby goats line up to get hugs..🐐🤗 pic.twitter.com/jgWXaXnWsg — 𝕐o̴g̴ (@Yoda4ever) November 26, 2023 మూగజీవాల హార్ట్ టచింగ్ వీడియో.. అయితే.. ఓ వ్యక్తి మాత్రం తన మేక పిల్లలకు అమితమైన ప్రేమను పంచుతున్నాడు. మాటలు రాని ఆ మేకలు సైతం తమదైన శైలిలో ఆ వ్యక్తిపై మమకారాన్ని చూపిస్తున్నాయి. ఈ అద్భుత ఘట్టం చూసిన జంతు ప్రేమికుల హృదాయాలు ఉప్పొంగిపోతున్నాయి. ఈ హార్ట్ టచింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లక్షల్లో లైక్లు, వందల కొద్దీ షేర్లు వస్తున్నాయి. ఈ వీడియోలో కొన్ని మేక పిల్లలు ఆ వ్యక్తి ప్రేమ కోసం పరితపించిపోతున్నాయి.. కౌగిలింతల కోసం క్యూ కట్టడం చూపరులను కట్టిపడేస్తోంది. ఒకదాని తర్వాత ఒకటి ఆ మేక పిల్లలు తమను ఎత్తుకొని ముద్దాడాలంటూ ఆ వ్యక్తితో చిన్న పిల్లాడిలా మారం చేస్తుంటే ఆ దృశ్యం ఎంతో ముచ్చట గొలుపుతోంది. @Yoda4ever ట్విటర్లో పెట్టిన ఈ అరుదైన వీడియోను 34 లక్షలకుపైగా చూశారు. స్వచ్ఛమైన ప్రేమను అమ్మకూడా అందించలేదంటూ.. ఈ వీడియో చూసిన నెటిజెన్లు, జంతు ప్రేమికులు..ఆ మూగజీవాల పట్ల ఆ వ్యక్తి చూపుతున్న ప్రేమకు ఫిదా అయ్యారు. ఇంతటి స్వచ్ఛమైన ప్రేమను అమ్మకూడా అందించలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. మూగజీవాలను పట్టించుకోకుండా వాటిపట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్న వారికి ఇలాంటి వీడియో చూసిన తర్వాతైన బుద్ధిరావాలంటూ కోరుకుంటున్నారు. ఈ రోజుల్లో మానవత్వం మంటగలిసిపోతుంది, మూగ జీవాలు చూపుతున్న ప్రేమలో సగమైనా మనుషులు చూపించడం లేదంటూ, ఈ యానిమల్ లవర్ను పొగుడుతూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. మాటలు రాకపోయినా మేకలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయంటూ మరికొందరు లైక్లు కొడుతున్నారు. ఇది కూడా చదవండి: కాళ్లతో శ్వాస తీసుకోవచ్చా..ఇదెక్కడి విడ్డూరం WATCH: #life-style మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి