JNTU: ఇక ఐదేళ్లలోనే బీటెక్, ఎంటెక్.. జేఎన్టీయూ కీలక నిర్ణయం..!! ఇంటర్ పూర్తి చేయగానే..ఇంటిగ్రేటెడ్ డ్యుయల్ డిగ్రీ కోర్సు పేరిట JNTUవచ్చేఏడాది నుంచి ఓ కొత్త ప్రోగ్రామ్ ను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈకోర్సులో చేరిన విద్యార్థులు 5ఏళ్ల వ్యవధిలో బీటెక్, ఎంఎస్ పూర్తి చేయవచ్చు. అది కూడా అమెరికాలో పట్టా పొందవచ్చు. By Bhoomi 06 Dec 2023 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఇంటర్ పూర్తవ్వగానే బీటెక్ చేసి అమెరికాలో ఎంఎస్ చేయలని ప్లాన్ చేస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇంటిగ్రేటెడ్ డ్యయల్ డిగ్రీకోర్సు పేరుతో జేఎన్టీయూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఓ సరికొత్త ప్రోగ్రామ్ ను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ కోర్సులో చేరిన విద్యార్థులు 5ఏళ్ల వ్యవధిలోనే బీటెక్, ఎంఎస్ పూర్తి చేసుకోవచ్చు. అది కూడా అమెరికాలో చదువు కంప్లీట్ చేసి పట్టా పొందవచ్చు. సాధారణంగా బీటెక్ చేసి ఎంఎష్ చేసేందుకు కనీసం 6 సంవత్సరాల సమయం పడుతుంది. కానీ ఐదు సంవత్సరాల్లోనే పూర్తయ్యే డ్యుయల్ డిగ్రీ కోర్సులో భాగంగా విద్యార్థులు 3ఏళ్లు జేఎన్టీయులో, రెండేళ్లు అమెరికాలో చదువుకోవల్సి ఉంటుంది. దీనికోసం అమెరికాలోని స్టీవెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ అలబామా, మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, లారెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి యూనివర్సిటీలతో జెఎన్టీయూ ఇప్పటికే అవగాహన ఒప్పందం చేసుకుంది. కంపూటర్స్, ఏరోస్పేస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమోటివ్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ మేనేజ్మెంట్, మెకట్రానిక్స్, రోబోటిక్స్ వంటి కోర్సుల్లో ఈ వర్సిటీల్లో మాస్టర్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఫీజుల్లో రాయితీలు కూడా లభిస్తాయి. అమెరికా యూనివర్సిటీల్లో పార్ట్ టైమ్ ఉద్యోగం కూడా ఉంటుంది. డ్యూయల్ డిగ్రీతో విద్యార్థులకు సమయంతోపాటు డబ్బు ఆదా అవుతుందని జేఎన్టీయూ అధికారులు చెబుతున్నారు. ఇక ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త. ఎలాంటి ఎంట్రన్స్ పరీక్ష లేకుండా ఎంటెక్ లో ప్రవేశాలు కల్పించే అవకాశం కల్పిస్తున్నాయి కొన్ని కాలేజీలు. రాష్ట్రంలోని కొన్ని పీజీ ఇంజనీరింగ్ కాలేజీలు కోర్సులకు ప్రవేశపరీక్షలేకుండా ప్రవేశాలు కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 6 పోస్టు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ లో కొన్ని పరీక్షలు రద్దు అయ్యే అవకాశం ఉంది. అందులో టెక్స్ టైల్ టెక్నాలజీ, ఎరోనాటికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ వంటి కోర్సులకు ప్రవేశ పరీక్షలు ఉన్నాయి. ఎలాంటి పరీక్షలు లేకుండా ప్రవేశాలు కల్పించే విధానంపై తెలంగాణ ఉన్నత విద్యామండలి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో జేన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహా రెడ్డి, ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మీ నారాయణ, పీజీఈసెల్ పూర్వ కన్వీనర్ రవీంద్రారెడ్డిలు ఉన్నారు. ఈ కమిటీ పలు సిఫార్సులు చేయనుండగా…వాటిని ప్రభుత్వానికి సమర్పిస్తారు. ప్రభుత్వం ఆయా ప్రతిపాదనలను ఆమోదించినట్లయితే జీవో జారీ అవుతుంది. ఈ మేరకు 2024-25 సంవత్సరానికి గాను ప్రవేశాలు కల్పిస్తారు. పీజీఈసెట్ ను మొత్తం 19 సబ్జెక్టులకు నిర్వహిస్తున్నారు. పలు కోర్సుల్లో సీట్లు ఎక్కువగా ఉండటం, ప్రవేశ పరీక్షకు హాజరయ్యేవారు తక్కువగా ఉండటంతో ఈ దిశగా అడుగులేస్తోంది తెలంగాణ ఉన్నత విద్యామండలి. కాగా బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీఈసెట్ పరీక్షా విధానం మార్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం 2004లో ఇచ్చిన జీవో 168 ప్రకారం అభ్యర్థులకు శారీరక దారుఢ్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ ఈవెంట్స్ కు బదులుగా రాతపరీక్షను నిర్వహించే అంశంపై ఉన్నత విద్యామండలి అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు అధ్యయనం చేసేందుకు కమిటీని కూడా నియమించారు. ఈ కమిటీలో పాలమూరు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్, ప్రొఫెసర్ సత్యనారాయణ, ప్రొఫెసర్ రాజేశ్ లు సభ్యులుగా ఉన్నారు. ఇది కూడా చదవండి: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.30 వేల భారీ డిస్కౌంట్.. ఫైనల్ ధర ఎంత తక్కువంటే? #jntu #btech #ms-within-five-years మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి