కుంభాభిషేకం తరువాత..స్వామి వారి దివ్య దర్శనం..!

హైదరాబాద్ శ్రీ నగర్ కాలనీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న అయ్యప్పస్వామి కుంభాభిషేక మహోత్సవాలు ఆదివారం ముగిశాయి.

New Update
కుంభాభిషేకం తరువాత..స్వామి వారి దివ్య దర్శనం..!

భాగ్యనగరంలోని శ్రీ నగర్ కాలనీ వెంకటేశ్వ స్వామి దేవాలయ ప్రాంగణంలో కొలువై ఉన్న ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ద్వితీయ పుష్కర కుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితులు, శబరిమల దేవాలయం నుంచి విచ్చేసిన ప్రధాన తంత్రి మేల్‌ శాంతిలు ఎంతో వైభవంగా ఆదివారం నాడు యంత్ర,బలిపీఠ, ధ్వజ స్తంభ శిఖర ప్రతిష్ఠ జరిపారు.

publive-image

గత ఐదు రోజులుగా జరుగుతున్న యజ్ఙయాగాది కార్యాక్రమాలను పూర్ణాహుతి కార్యక్రమంతో ముగింపు పలికారు. స్వామి కుంభాభిషేకం తరువాత పునర్నవీకరించిన దేవాలయంలో స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. నూతన దేవాలయంలో స్వామి దివ్య దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

publive-image

శబరిమల ప్రధాన అర్చకులు (తంత్రి) కంఠరారు మహేష్‌ మోహన్‌ తంత్రిచే తొలి పడిపూజ జరిగింది. సాయంత్రం శ్రీ నగర్‌ కాలనీ తిరువీధుల్లో స్వామి వారిని పల్లకిలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్‌ వి. అనిల్‌కుమార్‌, దేవాలయ ఛైర్మన్‌, సిహెచ్‌ రామయ్య, ఈఓ శ్రీమతి ఎన్‌. లావణ్య, అయ్యప్పస్వామి దేవాలయ ప్రధాన అర్చకులు జొన్నలగడ్డ శ్రీనివాస్‌ శర్మ, రామకృష్ణ శర్మ, దేవాలయ కమిటీ, అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.

publive-image

అయ్యప్ప స్వామి ఆలయాన్ని సుమారు కోటిన్నర వ్యయంతో పునర్నవీకరించిన సూరపనేని సునంద్‌- పద్మ ప్రియ దంపతులతో పాటు స్వామికి బంగారు కిరీటాన్ని అందించిన రాజ్య సభ సభ్యులు, హెటెరో ఫార్మసీ అధినేత బి పార్థసారథి రెడ్డి , దేవాలయ గోపురానికి ఇత్తడి తొడుగు దాత రాజ్య సభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ధ్వజ స్తంభం దాత సురగం శ్రీనివాస్‌- విజయ దంపతులకు వేదాశీర్వచనం అందించి అయ్యప్ప స్వామి ప్రధాన అర్చకులు జొన్నలగడ్డ శ్రీనివాస్‌శర్మ, ఇతర అర్చక సిబ్బంది చేతుల మీదుగా సన్మానం నిర్వహించారు.

publive-image

Also read: బస్సు డ్రైవర్ కు అనారోగ్యం.. విజయవాడ ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
తాజా కథనాలు