Ayodhya: రామాలయం వల్ల యూపీకి ఏటా రూ.4 లక్షల కోట్ల ఆదాయం..

అయోధ్యలో రామమందిరం నిర్మాణం వల్ల యూపీలో టూరిజం అభివృద్ధి చెందుతుందని.. ఈ ఏడాదిలో ఆ రాష్ట్రానికి రూ.4 లక్షల కోట్ల ఆదాయ వస్తుందని ఎస్‌బీఐ తన నివేదికలో వెల్లడించింది. తిరుపతి బాలాజీ, వాటికన్ సిటీ, మక్కా లాంటి ప్రదేశాల కంటే కూడా అయోధ్యకు ఎక్కువగా ఆదాయం వస్తుందని పేర్కొంది.

New Update
Ayodhya: అయోధ్యలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ.. కారణం అదేనా !

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రధాని మోదీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. సాధారణ భక్తులు కూడా రాములవారని దర్శించుకునే వెసులుబాటును ఇప్పటికే ప్రారంభించారు. అయితే రామమందిరం నిర్మాణం తర్వాత అయోధ్యకు అధిక సంఖ్యలో భక్తులు వెళ్తుండటంతో.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి ఆర్థికంగా ఎక్కువగా ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. యూపీలో రామమందిరంతో పాటు ఇతర టూరిస్టు ప్రదేశాల వల్ల 2024-25 లో దాదాపు 5 వేల కోట్ల టాక్స్‌ ఆదాయం రావొచ్చని.. 'ఎస్‌బీఐ' తన నివేదికలో వెల్లడించింది.

పర్యాటక రంగంలో అభివృద్ధి

అయోధ్యలో రామమందిరం వల్ల టూరిజం పెరుగుతుందని.. దీనివల్ల ఉత్తరప్రదేశ్‌కు ఈ ఏడాదిలో రూ.4 లక్షల కోట్ల ఆదాయ వస్తుందని నివేదిక పేర్కొంది. అంతేకాదు.. వాటికన్‌ సిటీ, మక్కా లాంటి ప్రదేశాలకు వెళ్లే సందర్శకుల కంటే అయోధ్యకు వెళ్లే వారి సంఖ్యే ఎక్కవగా ఉంటుందని.. ఫారిన్ స్టాక్ మార్కెట్ పరిశోధన సంస్థ జెప్ఫెరీస్‌ పేర్కొంది. అలాగే ప్రతి ఏడాది అయోధ్యకు 5 కోట్ల మంది భక్తులు వస్తారని.. దీనివల్ల కేవలం ఉత్తరప్రదేశ్‌ మాత్రమే కాకుండా ఇండియా టూరిజం కూడా అభివృద్ధి చెందుతుందని నివేదిక తెలిపింది.

Also Read: ఒంటిరిగానే పోటీ చేస్తాం.. ఇండియా కూటమికి దీదీ షాక్

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి బాలాజీ ఆలయానికి ప్రతి ఏడాది 2.5 కోట్ల మంది భక్తులు వస్తారు. దీంతో ఆలయానికి ఏటా రూ.1200 కోట్ల ఆదాయం వస్తుంది. జమ్మూ కశ్మీర్‌లో ఉన్న వైష్ణో దైవీ ఆలయానికి ఏటా 80 లక్షల మంది సందర్శకులు వస్తారు. ఆ ఆలయానికి ఏటా రూ.500 కోట్ల ఆదాయం వస్తుంది. ఇక ఆగ్రాలో ఉన్న తాజ్‌మహాల్‌కు ఏటా 70 లక్షల మంది టూరిస్టులు రావడంతో రూ.100 కోట్ల ఆదాయం వస్తుంది. మరోవైపు సౌదీలో ఉన్న మక్కాకు ప్రతి ఏడాది 2 కోట్ల మంది వెళ్లడంతో.. అక్కడ 12 బిలియన్‌ డాలర్ల ఆదాయం వస్తుంది. వాటికన్‌ సిటీకి ఏటా 90 లక్షల మంది సందర్శకులు వెళ్లడంతో అక్కడ 315 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని నివేదిక తెలిపింది.

ఒక్కరోజు రూ.25 వేల కోట్ల ఆదాయం

అయితే అయోధ్యకు మాత్రం ప్రతిరోజూ లక్ష మంది భక్తులు వెళ్తారని.. తర్వాత రోజుకి 3 లక్షల మంది కూడా వస్తారని ప్రభుత్వ అధికారులు అంచనా వేశారు. ఒక్కో భక్తుడు అయోధ్యకు వచ్చినందుకు సుమారు రూ.2500 ఖర్చు చేస్తే.. ఒక్క అయోధ్య మాత్రమే ఒక్కరోజులో ఏకంగా రూ.25 వేల కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. అలాగే యూపీలో ఉన్న వారణాసి, మధుర లాంటి ప్రదేశాలకు కూడా సందర్శకులు వెళ్లడంతో వాటి ఆర్థిక ఆదాయంపై కూడా సానుకూల ప్రభావం పడుతుందని అన్నారు. దీనివల్ల ఉత్తరప్రదేశ్‌ ఆర్థిక ఆదాయం ఏటా రూ.లక్ష కోట్లు ఉంటుందని.. ఇది ఇండియా ఆర్థికాభివృద్ధికి కూడా తోడ్పడుతుందని అధికారులు వెల్లడించారు.

Also Read: ఈవీఎం ఎలా హ్యాక్‌ చేస్తారో కళ్లకు కట్టినట్టు చూపించిన దిగ్విజయ్!

కొత్త ఉద్యోగాలు

మతపరమైన టూరిజం అనేది రవాణా, హోటల్స్, స్థానిక వస్తువుల ఉత్పత్తి లాంటి వాటిలో ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తాయని.. టూరిజం విభాగం అధికారులు తెలిపారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్, అమెరికా, యూఏఈ లాంటి దేశాలకు టూరిజం నుంచి ఎక్కవగా ఆదాయం వస్తుందని.. ఇప్పడు అయోధ్యలో నిర్మించిన రామమందిరం వల్ల ఇండియా కూడా ఆ దేశాల జాబితాలో చేరేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు