అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు.. అతిథులు ఎవరంటే?

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీని ఈ వేడుకకు ఆహ్వానించినట్లు పేర్కొంది.

New Update
Ayodhya Ram Mandir: మీ ఇంటికే అయోధ్యారాముడి మహాప్రసాదం..ఇలా స్వీకరించండి..!!

అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు అయింది. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభోత్సవం జరగనుందని రామందిరం ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీని ఈ వేడుకకు ఆహ్వానించనున్నారు. జనవరి 21 నుంచి 23 వరకు కార్యక్రమాలు జరగనున్నాయని పేర్కొంది. సాధువులు, ప్రముఖులను కూడా ఈ వేడుకలకు ఆహ్వానిస్తామని రామమందిర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. రామమందిరం ప్రారంభోత్సవంలోని ప్రధాన ఘట్టాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తామని.. అన్ని పార్టీల రాజకీయ నేతలను కూడా ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు.

ఈ వేడుకకు 136 సనాతన సంప్రదాయాలకు చెందిన 25వేల మంది హిందూ మత పెద్దలను ఆహ్వానించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తుది జాబితా సిద్ధమైన తర్వాత ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నిత్య గోపాల్ దాస్ సంతకంతో ఆహ్వానపత్రాలు పంపిస్తామన్నారు. అయోధ్యలోని పెద్ద మఠాలలో ప్రముఖ సాధువులందరికీ వసతి కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. రామజన్మభూమి ఆవరణలో జరిగే ఈ పవిత్రోత్సవ కార్యక్రమానికి మొత్తం 25,000 మంది సాధువులు, 10,000 మంది ప్రత్యేక అతిధులు హాజరవుతారని తెలిపారు.

2020 ఆగస్టులో భూమి పూజ..

ఆలయ భూమి పూజ కార్యక్రమం ఆగస్టు 5, 2020న కరోనా మార్గదర్శకాలు అనుసరించి ప్రారంభమైంది. అప్పటి నుంచి శరవేగంగా పనులు జరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం రాంలాలా గర్భగుడి ముగింపు దశకు చేరుకుంది. దీంతో వచ్చే జనవరి నెలలో 'ప్రాణ్ ప్రతిష్ఠ' కార్యక్రమంలో కోసం సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయోధ్యలో జరిగే పవిత్రాభిషేక మహోత్సవానికి వచ్చే భక్తులకు దాదాపు నెల రోజుల పాటు ఉచితంగా భోజనం అందించాలని ట్రస్ట్ భావిస్తోంది.

అసలు వివాదం ఏంటి?

16శతాబ్ధం నుంచే అయోధ్య స్థల వివాదం కొనసాగుతూ వస్తోంది. 1528లో అక్కుడున్న ఆలయాన్ని కూల్చి, మసీదును నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. 1949లో మసీదు ఆవరణలో రాముడు - సీతాదేవీల విగ్రహాలు కనిపించాయి. నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విగ్రహాలు మసీదు నుంచి తొలగించాలని ఆదేశించారు. అయితే హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అప్పటి నుంచి దాదాపు 40ఏళ్ల పాటు మసీదు గేట్లు మూసుకున్నాయి. ఆ తర్వాత 1989లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ మసీదు గేట్లు తెరవాలని ఆదేశించారు. దీనిని వీహెచ్‌పీ, ఆరెస్సెస్ వంటి హిందుత్వ సంస్థలు, బీజేపీ తీవ్రంగా ఖండించాయి. అక్కడ రామాలయం నిర్మించేందుకు ప్రచారం ప్రారంభించాయి.

ఈ నేపథ్యంలో అద్వానీ రథయాత్ర, 1992లో మసీదు కూల్చివేత వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. శతాబ్ధాలుగా సాగుతున్న ఈ వివాదానికి సుప్రీంకోర్టు 2019లో చెక్‌పెట్టింది. 2019, నవంబర్ 9న అయోధ్యలోని వివాదాస్పద భూమిని హిందూ దేవాలయాన్ని నిర్మించేందుకు ట్రస్టుకు అప్పగించాలని ఆదేశించింది. మసీదు నిర్మించడానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల భూమిని ఇవ్వాలని కూడా సూచించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు