అమెరికా వీధుల్లో రామనామస్మరణ.. మార్మోగిపోయిన వాషింగ్టన్ డీసీ

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ ఉత్సవాలు అమెరికాలో ఘనంగా మొదలయ్యాయి. జై శ్రీ రాం నినాదాలతో వాషింగ్టన్ వీధులు మార్మోగిపోయాయి. ఫ్రెడ్రిక్ సిటీ మేరీల్యాండ్ సమీపంలోని శ్రీ భక్త ఆంజనేయ ఆలయంలో 'హిందూ అమెరికన్ కమ్యూనిటీ' సభ్యులు సంబరాలు చేసుకున్నారు.

New Update
అమెరికా వీధుల్లో రామనామస్మరణ.. మార్మోగిపోయిన వాషింగ్టన్ డీసీ

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భారత దేశంలోనే కాదు ప్రపంచ నలుమూలలా ఉన్న భారతీయులతోపాటు హిందూ మతాన్ని గౌరవించే వారంతా ఈ సంబరాలు చేసుకుంటున్నారు. దాదాపు ఐదు వందల ఏళ్ల తర్వాత రామమందిర నిర్మాణం జరుగుతున్నందుకు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తూ పలు ప్రాంతాల్లో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం 'హిందూ అమెరికన్ కమ్యూనిటీ' సభ్యులు వాషింగ్టన్ డీసీలో ర్యాలీ నిర్వహించారు.

ఈ మేరకు అయోధ్య రామమందిరం  నిర్మితమవుతున్న వేళ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమ్యూనీటి సభ్యులు తెలిపారు. ఇందులో భాగంగా హిందూ మత గొప్పతనాన్ని ప్రపంచదేశాలకు చాటి చెప్పేందుకు శ్రీరాముడి జెండాలు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. జై శ్రీ రాం నినాదాలతో వాషింగ్టన్ వీధులు మార్మోగిపోయాయి. ఫ్రెడ్రిక్ సిటీ మేరీల్యాండ్ కు సమీపంలో ఉన్న శ్రీ భక్త ఆంజనేయ ఆలయంలో సమావేశమైన 'హిందూ అమెరికన్ కమ్యూనిటీ' సభ్యులు సంబరాలు చేసుకున్నారు.

ఇది కూడా చదవండి : జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. దాబాలోకి దూసుకెళ్లిన లారీ

ఇక దీనిపై మీడియాతో మాట్లాడిన సదరు కమ్యూనీటీ సభ్యులు.. 500 ఏళ్ల హిందువుల పోరాటం తర్వాత రామమందిర నిర్మాణం జరిగినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ మేరకు జనవరి 20న దాదాపు వెయ్యికి పైగా అమెరికన్ హిందూ కుటుంబాలు అయోధ్య వేడుకల్లో పాల్గొంటాయని, ఇందులో రామ్ లీలా, రాముడి కథలు, ప్రార్థనలు, భజనలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. అంతేకాదు అమెరికా చాప్టర్ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు మహేంద్ర సాపా మాట్లాడుతూ.. అమెరికాలో జన్మించిన పిల్లలకు హిందూ సంప్రదాయాలు, మతం గొప్పతనం అర్థం చేయించేందుకు 45 నిమిషాలపాటు శ్రీరాముడి జీవిత విశేషాలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Woman Attack: షాకింగ్ వీడియో.. మహిళను పైకి లేపి నేలకేసి ఎలా కొట్టారో చూశారా?

సోషల్ మీడియాలో తాజాగా ఒక వీడియో వైరల్‌గా మారింది. అందులో ఒక మహిళను మరో నలుగురు మహిళలు అతి దారుణంగా కొట్టడం చూడవచ్చు. జుట్టు పట్టుకుని, పిడుగుద్దులతో చితకబాదారు. ఆమెను పైకి లేపి నేలకేసి కొట్టారు. ఆ వీడియో చూసి నెటిజన్లు షాక్ అయ్యారు.

New Update
viral news

viral news

Woman Attack: మహిళలు ఒక్కసారి గొడవ పడ్డారంటే.. అది పూర్తయ్యేవరకు విడిచి పెట్టరు. నడి రోడ్డుపై సైతం తన్నుకునేందుకు ముందుంటారు. జనాలు ఉన్నారని చూడరు. ఎవరుంటే తమకేమి అన్నట్లు ప్రవర్తిస్తారు. జుట్లు పట్టుకుని బాదుకుంటారు. బట్టలు చిరిగేలా కొట్టుకుంటారు. ఆ సమయంలో వారిని ఆపడం చాలా కష్టం. ఇప్పటి వరకు చాలానే అలాంటి సంఘటనలు చూశాం. తాజాగా మరొకటి జరిగింది. 

మహిళపై దాడి

ఒక మహిళ నడుచుకుంటూ తిన్నగా తన ఇంటికి వెళ్తుండగా.. వేరొక మహిళ ఆమె ముందుండి నడుచుకుంటూ వెళ్తుంది. అలా కొంత దూరం నడిచి వెళ్తుండగా.. సడెన్‌గా ఇంకొందరు మహిళలు వచ్చి ఆమెపై దాడి చేశారు. దాదాపు నాలుగురు లేదా ఐదురుగు మహిళలు కలిసి ఒక మహిళను అతి దారుణంగా చితకబాదారు. 

Also Read: ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఉండవు : బీసీసీఐ

Also Read: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆ మహిళను జుట్టు పట్టుకుని.. పిడి గుద్దులతో ఎంత గుద్దినా.. తిరిగి చేయి ఎత్తలేదు. దెబ్బలు కాస్తున్నా తిన్నగా ఇంటివైపు నడుచుకుంటూ వెళ్లిపోయింది. సరిగ్గా అప్పుడే ఒక అబ్బాయి వచ్చి ఆ మహిళను అమాంతంగా పైకి లేపి కిందికి విసిరేశాడు. అప్పుడు కూడా ఆ మహిళ ఏం అనకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

Also Read: ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

viral-video | viral-news | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment