Bomb Hoax in Flight: విమానంలో సీటు కింద బాంబు..ప్రయాణికుడు అరెస్టు..!! ముంబై నుంచి లక్నో వెళ్తున్న విమానంలో బాంబు ఉందని ప్రయాణికుడు చెప్పడంతో కలకలం రేగింది. అప్రమత్తమైన సెక్యూరిటీ ఆ విమానాన్ని క్షణ్ణంగా తనిఖీ చేశారు. బాంబు లేదని నిర్థారించారు. బాంబు ఉందని బెదిరించిన ప్రయాణికుడిని పోలీసులు అరెస్టు చేశారు. By Bhoomi 27 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Bomb Hoax in Flight: విమానం ఎక్కిన ప్రయాణికుడు తన సీటు కింద బాంబు ఉందంటూ బెదిరించాడు. దీంతో ఆ విమానంలో కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ విమానాన్ని బాంబు స్వ్కాడ్ తో క్షణ్ణంగా తనిఖీ చేశారు. విమానంలో ఎలాంటి బాంబు లేదని సిబ్బంది నిర్థారించారు. దీంతో ఆ ప్రయాణికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటన మహారాష్ట్ర ముబైలో జరిగింది. శుక్రవారం రాత్రి ముంబై నుంచి లక్నో వెళ్లాల్సిన ఇండిగో విమానంలోకి 27ఏళ్ల యువకుడు ఎక్కాడు. సీటులో కూర్చున్న తర్వాత తన సీటు కింద బాంబు ఉందని గట్టిగా అరిచాడు. ఇది కూడా చదవండి: రేషన్ కార్డుల గడువు పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం..!! ప్రయాణికుడు అరవడంతో వెంటనే అప్రమత్తమైన ఇండిగో సిబ్బంది ఎయిర్ పోర్టు సెక్యూరిటీ, ముంబై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారంతా కలిసి విమానాన్ని తనిఖీ చేశారు. ఆ విమానంలో ఎలాంటి బాంబు లేదని తేల్చారు. తన సీటు కింద బాంబు ఉందని చెప్పిన ఆ ప్రయాణికుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో ఆ ఇండిగో విమానం చాలా ఆలస్యంగా ముంబై ఎయిర్ పోర్టు నుంచి లక్నోకు బయలు దేరింది. #passenger #bomb #indigo-flight #delayed మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి