AP: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. చదువుతో సంబంధం లేకుండా పదోన్నతులు!

ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్ ఇంక్రిమెంట్ల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై విద్యార్హతతో సంబంధం లేకుండా కార్మికులంతా AASకు అర్హులేనని స్పష్టం చేసింది.

New Update
AP: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. చదువుతో సంబంధం లేకుండా పదోన్నతులు!

APSRTC: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కార్మికులు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త అందించింది. ఇప్పటికే మున్సిపల్ కార్మికుల డిమాండ్లను పరిష్కరించేదుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం.. తాజాగా ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన పలు కీలక సమస్యలను పరిష్కరించేందుకు అంగీకరించింది. ఆర్టీసీ కార్మికుల విద్యా అర్హతలు, ఇంక్రిమెంట్లకు సంబంధించి ఇష్యూలపై సానుకూలంగా స్పందించింది.

అందరికీ పదోన్నతులు..
ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో జగన్ సర్కార్ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలోని పలు కీలక సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెళ్తుంది. వరుస ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదలచేయడంతోపాటు మున్సిపల్ కార్మికుల వేతనాలు సైతం పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగానే కొంతకాలంగా సమస్యగా మారిన ఆర్టీసీలో విద్యా అర్హతను బట్టి కేటాయించే పదోన్నతుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి : Telangana: విద్యార్థులకు గుడ్ న్యూస్.. విదేశీ విద్యకు రూ.20 లక్షల ఆర్థిక సాయం!

ఏఏఎస్ కు అర్హులే..
ఈ మేరకు ఆర్టీసీలో (APSRTC) ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్ (AAS) ఇంక్రిమెంట్ల అమలుకు నిబంధనలను సడలిస్తూ ఆర్టీసీ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆర్టీసీ ఉద్యోగులకు విద్యార్హతలను బట్టి 6/12/18/24/30 ఏళ్లకు పదోన్నతులు రాకపోతే ఏఏఎస్ కు అర్హులయ్యేవారు. అయితే ఈ పద్ధతి కారణంగా విద్యార్హతలు లేనివారికి నష్టం చేకూరేది. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయంతో విద్యార్హత లేని వారికి సైతం ఏఏఎస్ వర్తించనుంది. ఇక దీనిపై ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని, ఇన్నేళ్ల ఎదురుచూపులకు ఫలితం దక్కినందుకు ఆనందంగా ఉందంటున్నారు.

Also Read: ‘అనంత్‌ని చూసినప్పుడల్లా మా నాన్న ధీరూభాయ్ గుర్తొస్తాడు’ ముకేశ్ అంబానీ భావోద్వేగం..!

Advertisment
Advertisment
తాజా కథనాలు