సిరియాపై ఇజ్రాయెల్ దాడులను ఆపడంలేదు. ఓవైపు గాజాపై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం ఇటు సిరియాపైనా దాడులు కొనసాగిస్తోంది. డమాస్కస్‌లోని సైనిక ప్రదేశాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఒక సిరియన్ సైనికుడు మరణించాడు.

Trinath
హమాస్ కమాండర్‌ను మట్టుబెట్టేందుకు దక్షిణ గాజాలోని ఖాన్ యునిస్‌పై ఇజ్రాయెల్ దళాలు బాంబుల వర్షం కురిపించాయి. అయితే ఈ దాడుల్లో హమాస్ కమాండర్ చనిపోలేదు కానీ 90మంది సామాన్యులు మరణించారు. మరో 300మంది గాయపడ్డారు. 2023 అక్టోబర్ 7 నుంచి హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది.
గర్భిణీల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీమ్ పేరు 'ప్రధానమంత్రి మాతృ వందన యోజన'. చాలామందికి ఈ పథకంపై అవగాహన లేదు. 19ఏళ్లు దాటిన పేద గర్భిణీలు ఈ పథకానికి అర్హులు. ఈ పథకం కింద గర్భిణీలకు రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తారు.
వాట్సాప్ త్వరలో ఒక కొత్త ఫీచర్‌ను విడుదల చేయనుంది. వాట్సాప్ మెసేజీలను ఏ భాషలోకైనా ట్రాన్స్‌లేట్ చేసుకునే ఆప్షన్‌ను వాట్సాప్ కల్పించనుంది. ముందుగా ఇంగ్లీష్, హిందీ, అరబిక్, స్పానిష్, పోర్చుగీస్, రష్యన్ సహా కొన్ని భాషలకు సపోర్ట్ ఇచ్చేలా ఫీచర్ రానుంది. తర్వాత మిగిలిన భాషలకు కూడా ఈ ఫీచర్ సపోర్ట్ ఇస్తుంది.
US Presidents Assassinations and Attempts: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల ఘటనతో అగ్రరాజ్యం ఉలిక్కిపడింది.
ఆర్టీవీపై ఈడీ దాడులు చేసిందంటూ ఓ ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తున్నారు ఫేక్‌గాళ్లు. సొంతంగా బురదజల్లే దమ్ములేక ఫేక్ యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా తప్పుడు వార్తలు ప్రసారం చేయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీవీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఇలాంటి ఫేక్ న్యూస్ అల్లుతున్నారు!
దేశ సముద్ర సరిహద్దులను కాపాడే వారే ఇండియన్ కోస్ట్ గార్డ్స్. ఇందులో సెయిలర్, మెకానిక్ పోస్టుల భర్తీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇంటర్మీడియట్ పాస్ అయినవాళ్లు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. అప్లికేషన్‌కు జూలై 3 చివరి తేది!
Team India : వరల్డ్‌కప్ ఫైనల్ విక్టరీ తర్వాత అంతర్జాతీయ టీ20లకు రోహిత్ శర్మ గుడ్‌బై చెప్పడంతో టీమిండియా తర్వాతి కెప్టెన్ ఎవరన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ రేసులో అందరికంటే ముందుగా హార్దిక్‌పాండ్యా, బుమ్రా ఉన్నారు. అటు సూర్యకుమార్, పంత్‌లను బీసీసీఐ కన్సిడర్ చేస్తున్నట్టుగా సమాచారం.
రోజుకు 25 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. ఇది టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు రక్తపోటు కంట్రోల్‌లో ఉండేలా చేస్తుంది. వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది.
IND vs SA Final : 16ఏళ్లు 9 నెలల 5 రోజులు.. 52,70,40,000 సెకన్లు.. ఇండియా రెండోసారి టీ20 వరల్డ్‌కప్ గెలవడానికి ఇంత సమయం వేచి ఉన్నామని ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేశారు. ఇంతే ఓపిగ్గా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వేచి ఉంటే ప్రాణాలు కాపాడుకుంటామని ఢిల్లీ పోలీసులు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
/rtv/media/media_files/2025/04/07/5KWabvbOJh05lwezyrXD.jpg)