author image

srinivas

By srinivas

పారాసిటమల్ టాబ్లెట్స్ మనవాళికి చాలా ప్రమాదకరంగా మారుతున్నట్లు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. 'నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ' టెస్టులో 53 రకాల మందుల్లో నాణ్యత లేదని గుర్తించింది.  నేషనల్ | Latest News In Telugu | Short News

By srinivas

అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ద‌స‌రా పండుగ నాటికి ఇందిర‌మ్మ క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అర్హులందరికీ ఇందిర‌మ్మ ఇళ్లు ద‌క్కేలా చూడాలని సూచించారు.

By srinivas

తిరుపతి లడ్డూ వివాదం సినీ ఇండస్ట్రీలో మంటలు రేపుతోంది. పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సనాతన ధర్మం గురించి నోటికొచ్చినట్టుగా మాట్లాడవద్దని పవన్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఎవరి నమ్మకాలు వారివంటూ ప్రకాశ్‌రాజ్‌ కౌంటర్ రిప్లై ఇచ్చారు.

By srinivas

డప్పుకొట్టేందుకు రావట్లేదని కులపెద్దలు కుటుంబాన్ని బహిష్కరించిన ఘటన మెదక్ జిల్లా గౌతోజిగూడలో చోటుచేసుకుంది. బాగా చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడిన అన్నదమ్ములు చంద్రం, అర్జున్‌ను కులం నుంచి కులపెద్దలు వెలివేయగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 19 మంది పెద్ద మనుషులను అరెస్ట్ చేశారు. పరారిలోవున్న 14 మంది కోసం గాలిస్తున్నారు.

By srinivas

ICC టెస్టు ర్యాంకింగ్స్‌ విడుదల చేసింది. భారత్ నుంచి అన్ని ఫార్మాట్లలో టాప్-5లో యశస్వి జైస్వాల్ ఒక్కడే ఉన్నాడు. ఇంగ్లండ్‌ ప్లేయర్ జో రూట్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ 10, కోహ్లీ 12వ ర్యాంక్‌లో నిలిచారు. బౌలింగ్‌లో అశ్విన్ నెంబర్ 1స్థానంలో ఉన్నాడు.

By srinivas

నటి మృణాల్ ఠాకూర్ చంటిబిడ్డను ముద్దాడుతూ షేర్ చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. పెళ్లికిముందే బిడ్డను కన్నావా ఏంటి? అంటూ నెటిజన్స్ రచ్చ చేస్తున్నారు. 'ఎక్కడో తేడా కొడుతోంది. సీతకు సీమంతం ఎప్పుడో జరిగినట్లుంది. తండ్రి ఎవరో చెప్పేయ్' అంటూ ఆడేసుకుంటున్నారు. 

By srinivas

నటి, మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. తనలాగే తన అభిమానులు ఎల్లప్పుడూ అందంగా కనిపించేందుకు హోమ్ రెమిడీస్ చిట్కాలు చెప్పింది. ‘మీ కుటుంబం కోసం ఒక సీక్రెట్ ఫేస్ ప్యాక్. ఇది వండర్‌ఫుల్‌గా పనిచేస్తుంది' అంటూ ఓ పోస్ట్ పెట్టింది.

By srinivas

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. సచిన్ రికార్డు బ్రేక్ చేయలేడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ అన్నాడు. 'కోహ్లీ జోరు తగ్గింది. గత నాలుగేళ్లుగా గణాంకాలను చూస్తే అర్థమవుతోంది. అతను సచిన్‌ రికార్డులు బద్ధలు కొట్టడం అసాధ్యం' అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. 

By srinivas

తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నెయ్యి పంపించే ఏఆర్ డెయిరీపై కేసు నమోదైంది. టీటీడీ అధికారి మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేశారు. న్యాయ విచారణకు సిద్ధంగా ఉన్నామని డైరీ యాజమాన్యం ప్రకటించింది. 

By srinivas

ప్రియుడి మోజులో భర్తను కొడుకు కళ్లముందే కడతేర్చింది ఓ భార్య. సూర్యాపేట జిల్లా హనుమతండాకు చెందిన కౌసల్య మద్యం మత్తులో ఉన్న భర్త సైదాను గొడ్డలితో కొట్టి చంపింది. ప్రమాదంగా చిత్రీకరించి అందరినీ నమ్మించింది. కొన్నాళ్లకు కొడుకు వినోద్ నిజం బయటపెట్టడంతో కౌసల్యను పోలీసులు అరెస్ట్ చేశారు.  

Advertisment
తాజా కథనాలు