RCB: 'దండం పెట్టాల్సింది మీకు కదా బ్రో..' ఆర్‌సీబీ టీమ్‌పై ట్రోలింగ్‌!

ఐపీఎల్‌ ఆక్షన్‌లో ఆస్ట్రేలియా పేసర్‌ హెజిల్‌వుడ్ పేరును ఆక్షనీర్‌ బయటకు చదవగానే.. ఆర్‌సీబీ హెడ్ రాజేష్ వీ మీనన్ దండం పెట్టిన ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దండం పెట్టాల్సింది హెజిల్‌వుడ్‌కి కాదు ఆర్‌సీబీకి అంటూ ఫ్యాన్స్‌ ఫన్నీగా కౌంటర్లు వేస్తున్నారు.

New Update
RCB: 'దండం పెట్టాల్సింది మీకు కదా బ్రో..' ఆర్‌సీబీ టీమ్‌పై ట్రోలింగ్‌!

ఐపీఎల్‌లో ఒక కప్పు లేనప్పటికీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(Royal Challengers Bangalore)కు ఫ్యాన్‌ బేస్‌ ఏ మాత్రం తగ్గదు. మోస్ట్ లాయల్‌ ఫ్యాన్‌ బేస్‌ అని ఆ టీమ్‌ అభిమానులు చెప్పుకుంటుంటారు. ప్రతీసారి కప్‌ తమదేనని చెప్పుకోవడం.. ఓడిపోయిన తర్వాత మేం కప్పుల కోసం ఆడమని చెప్పడం వారి ఫ్యాన్స్‌కు అలవాటు. ట్రోఫీ కోసం కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం ఆడుతామని ఓడిన తర్వాత కవర్‌ చేసుకుంటుంటారు ఫ్యాన్స్‌. ఇలా ఏదో ఒక విధంగా ఆర్‌సీబీ పేరు ప్రజల్లో నోటిలో నానుతూనే ఉంటుంది. నిజానికి ఆర్‌సీబీ ఆట పరంగా చాలా ఫన్‌ ఇస్తుంటుంది. గెలిచినా ఓడినా అందులో ఏదో ఒక ఫీట్ మాత్రం ఉంటుంది. బౌండరీల వర్షం కురిపించినా వికెట్లు పేకమేడల్లా కూలినా అది ఆర్‌సీబీకే చెల్లింది. అలాంటి ఆర్‌సీబీ ఆక్షన్‌లో ఈసారి కాస్త ఫన్‌ చేసింది.

Also Read: టీమిండియా పేసర్‌ షమీకి అర్జున అవార్డు.. ప్రకటించిన కేంద్రం!

అసలేం జరిగిందంటే?
ఐపీఎల్‌ 2024 ఆక్షన్‌ ముగిసిన విషయం తెలిసిందే. కొందరు ప్రధాన ఆటగాళ్లు ఈ ఆక్షన్‌లో అన్‌సోల్డ్ అయ్యారు. అందులో ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్‌ స్మిత్‌తో పాటు పేసర్‌ హెజిల్‌వుడ్‌ కూడా ఉన్నాడు. నిజానికి హెజిల్‌వుడ్‌ చాలా మంచి బౌలర్‌. అయితే అతడిని వేలానికి వదిలేసింది ఆర్‌సీబీ. దీంతో అతను ఆక్షన్‌ లిస్ట్‌లోకి వచ్చాడు. ఆక్షనీర్‌ మల్లికసాగర్‌ హెజిల్‌వుడ్ పేరును బయటకు చదివారు. ఎవరూ అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అదే సమయంలో కెమెరా ఆర్‌సీబీ ఫ్రాంచైజీ వైపు తిరిగింది. అక్కడ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) హెడ్ రాజేష్ వీ మీనన్ ఉన్నారు. వెంటనే వెటకారంగా హెజిల్‌వుడ్ వద్దంటూ దండం పెట్టారు.

ఎందుకు దండం పెట్టారు?
రాజేష్ మీనన్ దండం పెట్టడంపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. దండం పెట్టాల్సింది ఆర్‌సీబీ ఫ్రాంచైజీకి కానీ హెజిల్‌వుడ్‌కు కాదు అని కౌంటర్లు వేస్తున్నారు. అయితే హెజిల్‌వుడ్‌ను ఆర్‌సీబీ వద్దు అనుకోవడానికి బలమైన కారణాలు ఉన్నాయి. 2023 ఐపీఎల్‌ సీజన్‌ సమయంలో హెజిల్‌వుడ్‌ పలుమార్లు గాయపడ్డాడు. అంతేకాదు వచ్చే సీజన్‌కు అతను అందుబాటులో ఉండేది డౌటేనట. అందుకే మిగిలిన ఫ్రాంచైజీలు కూడా హెజిల్‌వుడ్‌ని పట్టించుకోలేదు.

Also Read: ఈ ఇద్దరి ఆస్ట్రేలియా తోపులను పట్టించుకోని ఫ్రాంచైజీలు.. అన్‌సోల్డ్‌ ఫుల్‌ లిస్ట్ ఇదే!

WATCH:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

KCR: బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. దద్దరిల్లిన కేసీఆర్ ప్రసంగం

వరంగల్‌లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ రజతోత్సవ సభకు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తండోపతండాలుగా వచ్చారు. ఎవరూ ఊహించనంత జనంతో సభ దద్దరిల్లిపోయింది. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

New Update
Advertisment
Advertisment
Advertisment