Bhadradri Kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల పరిధిలోని బొజ్జాయిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు మారుతీ శ్రీనును(38) గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.

New Update
Bhadradri Kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల పరిధిలోని బొజ్జాయిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు మారుతీ శ్రీనును(38) గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. శ్రీను పాల వ్యాపారం చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే పాలను విక్రయించిన శ్రీను.. అనంతర వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. శ్రీను ఎంతకూ తిరిగి రాకపోవడంతో అతని కోసం కుటుంబ సభ్యులు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లారు. అతను సాగు చేసుకునే జామాయిల్‌ తోటలో శ్రీను రక్తపు మడుగుల్లో పడి ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

అనంతరం సమీప ప్రాంతాలకు చెందిన రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శ్రీనుని ఎవరు హత్య చేశారో తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శ్రీనుకు ఎవరితో అయిన గొడవలు ఉన్నాయా.. శ్రీను అంటే గిట్టని వారు ఎవరైనా ఉన్నారా.. గతంలో మృతుడితో సన్నిహితంగా ఉండి ఇప్పుడు దూరంగా ఎవరైనా ఉంటుంన్నారా అని ఆరా తీస్తున్నారు.

అంతే కాదు కుటుంబ సభ్యులు అనుమానితుల పేర్లు చెప్పడంతో పోలీసులు వారి వద్దకు వెళ్లారు. మృతుడితో వారికి ఎలాంటి గొడవలు ఉన్నాయి, అవి హత్య చేసేంత పెద్ద ఘర్షణలా అని విచారిస్తున్నారు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు డాగ్స్‌ స్కాడ్‌లను సైతం రంగంలోకి దింపారు. నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టమని పోలీసులు స్పష్టం చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Nightclub Roof Collapses : కూలిన నైట్ క్లబ్..150 మంది స్పాట్ లోనే...

నార్త్‌ అమెరికా డొమినికన్ రిపబ్లిక్ లోని సంతో డామింగో నగరంలో జెట్ సెట్ నైట్‌ క్లబ్ లో పై కప్పు కూలడంతో సుమారు 18 మంది మరణించారు. 120 మందికి పైగా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

New Update
Dominican Republic Nightclub Roof Collapses At Club

Dominican Republic Nightclub Roof Collapses At Club

Nightclub Roof Collapses : నార్త్‌ అమెరికా డొమినికన్ రిపబ్లిక్ లోని సంతో డామింగో నగరంలో జెట్ సెట్ నైట్‌ క్లబ్ లో పై కప్పు కూలడంతో సుమారు 18 మంది మరణించారు, 120 మందికి పైగా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద మరికొంతమంది ఉండవచ్చని తెలుస్తోంది. భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 8 న తెల్లవారుజామున 12:45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!


క్లబ్ లో మెరెంగే సింగర్ రూబీపెరెజ్‌ ప్రదర్శన ఇస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రూబీ ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఒక సారిగా భారీ శబ్ధంతో రూప్‌ కూలిపోవడంతో అప్పటివరకు ఆనందంతో కెరింతలు కొడుతున్న వారంతా హాహాకారాలు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న వారంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. 

Also Read: Bigg Boss 9: కింగ్‌కు రెస్ట్.. బరిలోకి బాలయ్య- బిగ్ బాస్ 9 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే..


ఈ ప్రమాదంలో రూబీ పెరెజ్‌ గాయపడడంతోపాటు ఆయన బృందలోని శాక్సోఫోనిస్ట్ కూడా మరణించినట్లు తెలుస్తోంది. క్లబ్‌లో ప్రమాదం జరిగన సమయంలో  సుమారు 500 నుండి 1000 మంది ఉన్నట్లు తెలుస్తోంది.. శిథిలాల కింద మరికొంతమంది ఉండవచ్చని భావిస్తున్నారు. 400 మంది సహాయక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కాగా  జెట్ సెట్ నైట్‌ క్లబ్ లో ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయని కానీ ఈ రోజు ప్రమాదం జరగడానికి కారణం ఏంటని మాత్రం తెలియరాలేదు. రూప్‌ బలహీనంగా ఉండటం వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చన్న వాదన వినపడుతోంది.

Also Read: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?

Also Read: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

Advertisment
Advertisment
Advertisment