Australian Open: లేటు వయసులో చరిత్ర సృష్టించిన రోహన్ బోపన్న భారత టెన్నిస్ స్టార్, 43 ఏళ్ల రోహన్ బోపన్న చరిత్ర సృష్టించాడు. శనివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 డబుల్స్ ఫైనల్ విభాగంలో సహచరుడు ఎబ్డెన్‌తో కలిసి ఫైనల్‌లో ఇటలీ జోడీ సిమోన్-వావాసోరిపై ఘన విజయం సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. By srinivas 27 Jan 2024 in ఇంటర్నేషనల్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Rohan Bopanna: భారత టెన్నిస్ స్టార్, 43 ఏళ్ల రోహన్ బోపన్న (Rohan Bopanna) చరిత్ర సృష్టించాడు. శనివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 (Australian Open 2024) డబుల్స్ ఫైనల్ విభాగంలో తన సహచరుడు ఎబ్డెన్‌తో కలిసి ఫైనల్‌లో ఇటలీ జోడీ సిమోన్-వావాసోరిపై ఘన విజయం సాధించాడు. ఈ విజయంతో కెరీర్‌లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు బోపన్న. అంతేకాదు అతిపెద్ద వయసులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన టెన్నిస్ ప్లేయర్‌గానూ రోహన్ బోపన్న ఘనత సాధించడం విశేషం. MISSION ACCOMPLISHED 🏆@mattebden and @rohanbopanna win their first Grand Slam title as a team!#AusOpen pic.twitter.com/nsioO6qF3S — #AusOpen (@AustralianOpen) January 27, 2024 ఈ మేరకు శనివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను భారత్‌కు చెందిన రోహన్ బోపన్న-ఆస్ట్రేలియన్ మాథ్యూ ఎబ్డెన్ జోడీ 7-6(0) 7-5 తేడాతో అన్‌సీడెడ్ ఇటాలియన్ జోడీ సిమోన్ బోలెల్లి, ఆండ్రియా వవాస్సోరిపై ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నారు. ఇక ఇంతకు ముందు 2017 ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో కెనడాకు చెందిన గాబ్రియేలా డబ్రోవ్‌స్కీతో కలిసి బోపన్న గ్రాండ్‌స్లామ్ విజయం సాధించాడు. Doubles delight 🏆🏆@rohanbopanna 🇮🇳 and @mattebden 🇦🇺 defeat Italian duo Bolelli/Vavassori 🇮🇹 7-6(0) 7-5. @wwos • @espn • @eurosport • @wowowtennis pic.twitter.com/WaR2KXF9kp — #AusOpen (@AustralianOpen) January 27, 2024 తోటి ఆస్ట్రేలియన్ మాక్స్ పర్సెల్‌తో కలిసి 2022లో వింబుల్డన్ గెలిచిన తర్వాత ఎబ్డెన్‌కి ఇది రెండో పురుషుల డబుల్స్ టైటిల్. కాగా ఈ ఫైనల్‌లో సిమోన్ - వావాసోరి జోడీ నుంచి రోహన్ - ఎబ్డెన్‌కు టఫ్ ఫైట నడిచింది. ఫస్ట పాయింట్ నుంచి ఇరు టీమ్‌లు హోరాహోరీగా తలపడ్డాయి. మొదటి సెట్‌ను 7-6 (7/0)తో రోహన్ జోడీ నెగ్గింది. Look what it means to @rohanbopanna and @mattebden 😍 At 43, Bopanna has his FIRST Men's Doubles Grand Slam title - and becomes the oldest to do so in the Open Era 👏👏#AusOpen pic.twitter.com/qs0JlrkMO7 — #AusOpen (@AustralianOpen) January 27, 2024 ఇక రెండో సెట్‌లోనూ ఆటగాళ్లు విజయం కోసం నువ్వా నేనా? అన్నట్లు పోరాడారు. ఒక దశలో రోహన్ జోడీ 3-4తో వెనకబడినప్పటికీ మళ్లీ పుంజుకుంది. మ్యాచ్ ఫలితం మూడో సెట్‌కు వెళ్తుందా? లేదా? అనే టెన్స్ న్ మొదలవగా రోహన్ - ఎబ్డెన్ జోడీ అదరగొట్టేసింది. రెండో సెట్‌ను 7-5 తేడాతో నెగ్గి ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచింది. ఇక రోహన్ బోపన్నకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రోహన్‌కు ‘పద్మ’ పురస్కారం ప్రకటించింది. #rohan-bopanna #australian-open-2024 #mens-doubles-final మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి