Astro Tips: ప్రతి గురువారం విష్ణువును ఇలా పూజించండి.. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయ్..!

గురువారం నాడు శ్రీమహావిష్ణువు, బృహస్పతిని పూజిస్తే జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాలు తొలగిపోతాయని మత గ్రంథాలు చెబుతున్నాయి. ఈ రోజున నీళ్లలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయాలి. రావి చెట్టు, తులసి చెట్టును పూజిస్తే మేలు జరుగుతుంది. ఇలా చేస్తే శ్రేయస్సు, ఆనందం కలుగుతుంది.

New Update
Astro Tips: ప్రతి గురువారం విష్ణువును ఇలా పూజించండి.. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయ్..!

Astro tips: సనాతన హిందూ సంప్రదాయం ప్రకారం గురువారం శ్రీ మహా విష్ణువు, దేవగురు బృహస్పతికి ఆరాధానకు చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించడం వలన జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి.. సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల్లో విశ్వాసం. అందుకే గురువారం రోజున ఆచారాల ప్రకారం శ్రీమహావిష్ణువును ఆరాధించడం ద్వారా.. ఆయన త్వరగా ప్రసన్నుడవుతారని, భక్తుల కోరికలు తీరుస్తారని ప్రతీతి. మీరు మీ జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ విజయం సాధించలేకపోతే.. గురువారం ఉపవాసం ఉండటం వల్ల మేలు జరుగుతుందని మత గ్రంథాలు, జ్యోతిష్య, వేద పండితులు చెబుతున్నారు. ఈ రోజున చేసే పూజల వల్ల శ్రీమహావిష్ణువు మాత్రమే కాదు, లక్ష్మి మాత కూడా సంతోషిస్తుంది. గురువారం ఉపవాసం ఉండటం వల్ల వివాహ సంబంధిత సమస్యలు సైతం తొలగిపోతాయట. మరి గురువారం పూజకు సంబంధించిన పరిహారాలు ఓసారి చూద్దాం..

పసుపు..

గురువారం నాడు బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో పసుపు వేసి, అదే నీటితో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఓం బ్రిం బృహస్పత్యే నమః అనే మంత్రాన్ని జపించండి.

తిలకం పెట్టుకోవాలి..

హిందూ మత ఆచారాల ప్రకారం.. ప్రతిరోజూ నుదుటిపై తిలకం పెట్టే సంప్రదాయం ఉంది. అయితే బృహస్పతి, విష్ణువు ఆశీర్వాదం పొందడానికి ప్రత్యేకంగా గురువారం నాడు కుంకుమ తిలకం పెట్టుకోవడం మేలు చేస్తుంది. ఎక్కడికైనా బయటకు వెళుతుంటే నుదిటిపై కుంకుమ తిలకం పెట్టుకుని బయటకు వెళ్లాలి. కుంకుమ అందుబాటులో లేకుంటే పసుపును కూడా పెట్టుకోవచ్చు.

ఈ చెట్లను, మొక్కలను పూజించండి..

బృహస్పతి, శ్రీమహావిష్ణువును ప్రసన్నం చేసుకోవాలనుకుంటే.. గురువారం నాడు రావి చెట్టును పూజించడం శ్రేయస్కరం. రావి చెట్టు వేరులో బ్రహ్మ, కొమ్మలో విష్ణువు, పైభాగంలో శివుడు ఉంటాడని విశ్వాసం. ఈ రోజున తులసిని పూజించడం వల్ల కూడా మేలు జరుగుతుంది. ఇలా చెట్లను, మొక్కలను పూజించడం వల్న ఆనందం, శ్రేయస్సు, ఆశీర్వాదం లభిస్తుంది.

ఎలాంటి దుస్తులు ధరించాలంటే..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఆనందం, శ్రేయస్సు ధరించే దుస్తులతో కూడా ముడిపడి ఉంటుంది. గురువారం నాడు.. దేవగురువు బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి పసుపు రంగు దుస్తులను ధరించండి. వీలైతే, ఈ రోజున కొత్త బట్టలు ధరించండి.

Also Read:

కేసీఆర్‌కు జై కొట్టిన పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి.. వీడియో వైరల్..

కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూపై కేసు నమోదు..

Advertisment
Advertisment
తాజా కథనాలు