Asthma: వేసవిలో కూడా ఆస్తమా పెరుగుతుందా..? ఈ జాగ్రత్తలు తీసుకోండి వేసవిలో వాతావరణం మార్పులతోపాటు ఆహారం, జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. వేసవిలో ఆస్తమా రోగి తీవ్రమైన వేడిలో వ్యాయామం చేస్తే శరీరంలో డీహైడ్రేషన్‌తోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. బయటకు వెళ్ళినప్పుడల్లా N95 మాస్క్‌పెట్టుకోవాలి. By Vijaya Nimma 03 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Asthma: ఒక్కో సీజన్‌లో ఒక్కో రకమైన సమస్యలు కొందరిని వేధిస్తుంటాయి. ముఖ్యంగా శ్వాస, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారికి వాతావరణం మారినప్పుడు శారీరక సమస్యలు ఎక్కువగా అవుతాయి. ముఖ్యంగా శ్వాసకోశ, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు ఉన్నవారు శీతాకాలంలో, వేసవిలో లేదా మారుతున్న సీజన్లలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఎందుకంటే అలాంటి వారికి వాతావరణం మార్పులతోపాటు ఆహారం, జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. ఆస్తమా రోగులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, ఛాతీ బిగుతు వంటి సమస్యలు ఉంటాయి. ఉష్ణోగ్రత పెరగడం వల్ల కూడా ఆస్తమా రావచ్చు. అందుకే వేసవిలో ఆస్తమాను మొదటి నుంచి అదుపులో ఉంచుకోవాలి. వేసవిలో ఆస్తమా ట్రిగ్గర్‌లను నివారించడానికి కొన్ని నివారణ చిట్కాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: వేడిలో ఎక్కువగా ఉంటే బయటకు వెళ్లితే ఆస్తమా లక్షణాలను పెంచుతుంది. దుమ్ము, ధూళి కారణంగా అలెర్, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా బయటకు వెళ్లాలని భావిస్తే, ముక్కు,నోటికి గుడ్డ కట్టుకుంటే మంచిది. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వేడిలో వ్యాయామం చేస్తే శరీరంపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. ఆస్తమా రోగి తీవ్రమైన వేడిలో వ్యాయామం చేస్తే శరీరంలో డీహైడ్రేషన్‌తోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. వేసవిలో నీరు పుష్కలంగా త్రాగడం చాలా ముఖ్యం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆస్తమా రోగి వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి. ముఖ్యంగా జలుబుకు దూరంగా ఉంటే మంచిది. వేసవిలో ప్రత్యేక శ్రద్ధ: వేసవిలో.. ఆస్తమా రోగులు బయటకు వెళ్ళినప్పుడల్లా N95 మాస్క్ పెట్టుకుంటే దుమ్ము, మట్టి వంటి ఇబ్బంది ఉండదు. మద్యం, సిగరెట్ పొగకు దూరంగా ఉండాలి. బయట వ్యాయామం కంటే ఇండోర్ వ్యాయామం ప్రయోజనకరం. మందులు, ఇన్హేలర్లను దగ్గర సరిగ్గా ఉంచుకోవాలి. ఛాతీలో కఫం పేరుకుపోకుండా ఉండటానికి.. రోజుకు రెండుసార్లు ఆవిరి తీసుకోవాలి. టెన్షన్, ఒత్తిడి ఉంటే సమస్య పెరుగుతుంది. ఇది కూడా చదవండి: బైక్ తీయబోయిన వ్యక్తికి గుండె ఆగినంత పనైంది గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #asthma #precautions మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి