బిగ్ బ్రేకింగ్.. రేపు కూడా కొనసాగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..ఆర్టీసీ బిల్లు ఎఫెక్ట్ By Trinath 05 Aug 2023 in హైదరాబాద్ New Update షేర్ చేయండి టీఎస్‌ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ ఆమోదం విషయంలో సస్పెన్స్ నెలకొని ఉండడంతో రేపు కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనుంది ప్రభుత్వం. టీఎస్ ఆర్టీసీ బిల్లును ఎలాగైనా పాస్ చేయాలని చూస్తున్న సర్కార్.. గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తోంది. నిజానికి ముందుగా మూడు రోజులే అసెంబ్లీ జరపాలని నిర్ణయించుకున్నా.. ఈ బిల్లు ఆమోదించడం కోసమే మరో రోజు కూడా సమావేశాలను పొడిగించాలని ప్రభుత్వం భావించినట్టు సమాచారం. ప్రస్తుత ప్రభుత్వానికి ఇవే చివరి అసెంబ్లీ ఎన్నికలు.. ఎందుకంటే సీతాకాల అసెంబ్లీ సమావేశాలు వచ్చే లోపే తెలంగాణలో ఎన్నికలు జరిగిపోతాయి.. అప్పటికే కొత్త ప్రభుత్వం కూడా కొలువుదీరడం ఖాయం.. అందుకే ఈ బిల్లును ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించాలని సర్కార్ కంకణం కట్టుకున్నట్టు అర్థమవుతుంది. ముందు సంతకం పెట్టాండి.. ప్లీజ్: మరోవైపు టీఎస్‌ఆర్టీసీ (Ts Rtc) కార్మికుల నిరసనలు కొనసాగుతున్నాయి. గవర్నర్ నేరుగా తమతో చర్చించాలని అనుకోవడం మంచి విషయమేనని.. అయితే చర్చల కంటే ముందు బిల్లు ఆమోదించాలని పట్టుపడుతున్నారు కార్మికులు. తెలంగాణ ప్రభుత్వం పంపించిన ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సంతకం చేయాలంటూ రాజ్ భవన్‌ను ముట్టడించారు. నెక్లెస్ రోడ్ మీదుగా ర్యాలీగా వచ్చిన వేలాది మంది కార్మికులు రాజ్ భవన్ ముందు బైఠాయించారు. బిల్లుపై సంతకం చేసి ప్రభుత్వానికి పంపించాలని నినాదాలు చేస్తున్నారు. బిల్లులో అంశాలపై వివరణ సంగతి తర్వాత చూడొచ్చు అని ముందు బిల్లుకు ఆమోదం తెలపాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఇక ఈ పరిణామాల సమయంలోనే మరో రోజుకు అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతుండడంతో ఈ రెండు రోజుల్లోనే ఈ బిల్లును ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది. గవర్నర్ అంగీకారం కోసం ఎదురుచూస్తోంది. నిజానికి గతంలోనూ కొన్ని బిల్లులను తమిళిసై వెనక్కి పింపినా.. ఇది ఆర్థిక సంబంధమైన బిల్లు కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ బిల్లు ఆమోదం కోసం తమిళిసై గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తప్పనిసరి. మరోవైపు కార్మిక సంఘాల చర్చల తర్వాత ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే ఆర్టీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి పాస్ చేయించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోంది. ఆదివారంతో అసెంబ్లీ సమావేశాలు ముగియనుండడంతో ప్రభుత్వం వేగంగా స్పందిస్తోంది. ప్రభుత్వానికి ఇవే చివరి సమావేశాలు కావడంతో ఆర్టీసీ బిల్లును పాస్ చేయించాలని ప్రయత్నిస్తోంది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపే దీనిపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది #tsrtc #cm-kcr #telangana-assembly #governor-tamilisai #tsrtc-bill #telangana-rtc-bill #telangana-assembly-sessions #ts-assembly మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి