Asad House Attack: 'భారత్ మాతాకీ జై..' ఒవైసీ ఇంటిపై మరోసారి అటాక్!

ఎంపీ అసదుద్దీన్‌ ఇంటిపై దుండగులు మరోసారి దాడి చేశారు. పార్లమెంట్‌లో ప్రమాణస్వీకారం తర్వాత ఒవైసీ జై పాలస్తీనా నినాదాలు చేసినందుకు వ్యతిరేకంగా కొందరు ఈ అటాక్‌ చేసినట్టుగా తెలుస్తోంది. భారత్ మాతాకీ జై, ఐ స్టాండ్ విత్ ఇజ్రాయెల్ అంటూ ఒవైసీ ఇంటిపై పోస్టర్లు అంటించారు.

New Update
Asad House Attack: 'భారత్ మాతాకీ జై..' ఒవైసీ ఇంటిపై మరోసారి అటాక్!

MIM చీఫ్, ఎంపీ అసదుద్దీన్‌ ఇంటిపై మరోసారి అటాక్ జరిగింది. ఢిల్లీలోని ఆయన నివాసంపై దుండగులు దాడి చేశారు. ఓవైసీ ఇంటిపై బ్లాక్‌ ఇంక్‌తో పాటు పోస్టర్లు అంటించారు. ఇంటి నేమ్‌ ప్లేట్‌, గేటుపై ఆయన పేరు కనిపించకుండా బ్లాక్ ఇంక్ పూశారు. భారత్ మాతాకీ జై, ఐ స్టాండ్ విత్ ఇజ్రాయెల్ అంటూ పోస్టర్లు అంటించారు. లోక్‌సభలో ప్రమాణ స్వీకారం సందర్భంగా అసదుద్దీన్ 'జై పాలస్తీనా' అనడంపై దుమారానికి కారణమైంది. పార్లమెంట్‌ సాక్షిగా మరో దేశం పేరు పలకడంపై బీజేపీ సహా పలు పార్టీలు భగ్గుమంటున్నాయి. ఓవైసీ వైఖరిని తప్పుబడుతూ దుండగులు ఇంటికి పోస్టర్లు అంటించారు. ఓవైసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


ఎంపీలకు భద్రత లేదా?
ఢిల్లీలోని తన ఇంటిపై జరుగుతున్న దాడులపై అసదుద్దీన్‌ సీరియస్‌ అయ్యారు. తన ఇంటిపై దాడి చేసిన వారికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఇలాంటి దాడులకు భయపడేదే లేదని చెప్పారు. ఇలాంటి పిరికిపంద చర్యలు ఆపాలని హెచ్చరించారు. రాళ్లు విసరడం, సిరా చుక్కలు చల్లడం లాంటివి కాకుండా తనతో డైరెక్ట్‌గా ఫైట్‌ చేయాలని సవాల్‌ విసిరారు ఒవైసీ. పదే పదే తన ఇంటిని టార్గెట్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యవేక్షణలో ఇదంతా జరిగిందని ఆరోపిస్తున్నాయి MIM వర్గాలు. ఎంపీల భద్రతకు ఎలాంటి గ్యారంటీ ఇస్తారో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే విషయంపై స్పీకర్‌ను కోరారు ఓవైసీ.

అప్పుడు కూడా ఇలానే చేశారు:
అయితే గతంలోనూ పలుమార్లు ఓవైసీ ఇంటిపై దాడులు జరిగాయి. 2023 ఫిబ్రవరిలో జైపూర్‌లో ఉన్నప్పుడు ఒవైసీ ఇంటిపై రాళ్లు రువ్వారు దుండగులు. ఆ సమయంలో ఒవైసీ సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దుండగులు తన ఇంటిపై రాళ్లు రువ్వారని, అద్దాలు పగులగొట్టారని ఆరోపించారు. 2022 యూపీలో ఎన్నికల ప్రచారంలో కూడా ఒవైసీపై కాల్పులు జరిగాయి.

అసలేం జరిగింది?
జూన్ 25న పార్లమెంట్‌లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో ఒవైసీ 'జై పాలస్తీనా' అంటూ నినాదాలు చేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన 'జై భీమ్, జై మైమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా' అన్నారు. ఎన్డీయే ఎంపీలు ఈ నినాదాలను నిబంధనలకు విరుద్ధమన్నారు. అయితే అణగారిన ప్రజల సమస్యలను లేవనెత్తుతూనే ఉంటానని ఒవైసీ చెబుతున్నారు. తాను చెప్పాల్సింది చెప్పానని, అది రాజ్యాంగానికి వ్యతిరేకం కాదంటున్నారు ఒవైసీ. అటు కేంద్రమంత్రులు జి కిషన్ రెడ్డి, కిరణ్ రిజిజు ఒవైసీ 'జై పాలస్తీనా' నినాదాన్ని వ్యతిరేకించారు. ఈ నినాదం సభా నిబంధనలకు విరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని కిషన్‌రెడ్డి విమర్శించారు.

Also Read: అతివేగంతో కారు ఢీ.. పల్టీ కొట్టిన స్కూల్ బస్సు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DC VS MI: ఢిల్లీకి బ్రేక్ పడింది..ఉత్కంఠ మ్యాచ్ లో గెలిచిన ముంబయ్

ఐపీఎల్ లో అంతా తారుమారు అవుతోంది. వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్న టీమ్ లు అనూహ్యంగా ఓడిపోతున్నాయి. పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న జట్లు మ్యాచ్ లు గెలుస్తున్నాయి. ఈరోజు  ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయ్ విజయం సాధించింది. 

New Update
ipl

DC VS MI

ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. సూపర్ మ్యాచ్ లో ముంబయ్ విజయం సాధించింది. ఈరోజు ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయ్ ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఎమ్ఐ 12 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ 206 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీకి ఇచ్చింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన డీసీ బ్యాటింగ్‌కు దిగిన  19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఢిల్లీ బ్యాటర్ కరుణ్‌ నాయర్‌  40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 89 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో కర్ణ్‌ శర్మ 3, దీపక్‌ చాహర్‌ 1, బుమ్రా 1, శాంట్నర్‌ 1 వికెట్లు తీశారు. ముంబయ్ కు ఇది రెండో విజయం.

భారీ స్కోర్ ఇచ్చిన ముంబయ్..

అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులో 59 పరుగులు చేశాడు. రికెల్టన్ 41, సూర్యకుమార్ 40, నమన్ 38 పరుగులతో రాణించారు. విప్రజ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. మకేశ్ ఓ వికెట్ తీశారు. చివరి ఓవర్లో 11 రన్స్ చేశారు ముంబయ్ బ్యాటర్లు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(18) మరోసారి నిరాశపరిచాడు. ఐదో ఓవర్లో విప్రజ్‌ వేసిన చివరి బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. చివర్లో నమన్ దూకుడుగా ఆడి ముంబయ్ ఎక్కువ స్కోరు వచ్చలా చేశాడు. ఢిల్లీ  బౌలర్లలో విప్రజ్‌, కుల్దీప్‌ రెండేసి వికెట్లు.. ముకేశ్‌ ఒక వికెట్‌ తీశారు.    

today-latest-news-in-telugu | IPL 2025 | dc | delhi | mumbai-indians

Also Read: DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

Advertisment
Advertisment
Advertisment