Lakshadweep : లక్షద్వీప్‌లో మరో కొత్త ఎయిర్‌పోర్టు కట్టే యోచనలో కేంద్రం..

లక్షద్వీప్‌లోని మినికోయ్‌ దీవుల్లో ఓ కొత్త ఎయిర్‌పోర్టును నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచినస్తున్నట్లు తెలుస్తోంది. మిలిటరీ అలాగే వాణిజ్య అవసరాల కోసం ఈ ప్రాంతంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రణాళికలు ప్రారంభించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

New Update
Israel: లక్షద్వీప్‌ కి వెళ్లొచ్చంటున్న ఇజ్రాయెల్‌!

New Airport : లక్షద్వీప్(Lakshadweep) వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఇటీవల ప్రధాని మోదీ(PM Modi) ఆ ప్రాంతంలో పర్యటించిన తర్వాత లక్షద్వీప్ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకుల దృష్టి లక్షద్వీప్‌పై పడుతోంది. ఇప్పటిగే ఈ ప్రాంతం గురించి తెలుసుకునేందుకు అనేక మంది గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. మరోవైపు లక్షద్వీప్‌లో టూరిజంను, మౌలిక సదుపాయలను అభివృద్ధి చేసేందుకు భారత ప్రభుత్వం కూడా నడుం బిగించింది.

మిలిటరీ, వాణిజ్య అవసరాల కోసం

అయితే ఈ క్రమంలోనే లక్షద్వీప్‌లో కొత్తగా మరో విమానశ్రయాన్ని నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మిలిటరీ అలాగే వాణిజ్య అవసరాల కోసం మినికోయ్‌(Minicoy)లో నిర్మాణానికి ప్రణాళికలు ప్రారంభించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఫైటర్‌ జెట్‌లు, సైనిక రవాణా ఎయిర్‌క్రాఫ్ట్‌లతో సహా.. వాణిజ్య విమానాల కోసం ఓ కొత్త విమానశ్రయాన్ని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్స్‌ చేస్తోందని సమాచారం.

Also read: ఫార్ములా ఈ-రేస్‌ అందుకే రద్దు.. మంత్రి భట్టి కీలక వ్యాఖ్యలు

గతంలోనే కేంద్రానికి విజ్ఞప్తి

మినికోయ్ దీవుల్లో ఈ నూతన ఎయిర్‌పోర్టు(New Airport) ను నిర్మించాలని యోచినట్లు తెలుస్తోంది. అయితే గతంలోనే మినికోయ్‌ దీవుల్లో రక్షణరంగ అవసరాల నిమిత్తం ఎయిర్‌ఫీల్డ్‌ను నిర్మించాలని ప్రతిపాదనలు వచ్చాయి. హిందూ, అరేబియా మహా సముద్రాల్లో సముద్రపు దొంగలు కూడా పెరగడం, సంఘ వ్యతిరేక కార్యకలపాలు జరుగుతున్న నేపథ్యంలో.. వీటిపై నిఘా పెంచడానికి మినికోయ్ దీవుల్లో ఎయిర్‌ఫీల్డ్‌ని నిర్మించాలని కోస్ట్‌గార్డ్‌ కూడా గతంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

Also read: వరుసగా భయపెడుతున్న బోయింగ్ విమానం లోపాలు.. ఇప్పుడు భారత్‌లో కూడా

ఇలాంటి తరుణంలో తాజాగా పౌర విమానాలు కూడా రాకపోకలు సాగించేలా మినికోయ్‌ దీవుల్లో కొత్త విమానశ్రయం నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇలా చేయడం వల్ల ఇక్కడ పర్యాటకంగా కూడా అభివృద్ధికి ఉపయోగపడుతుందని భావిస్తోంది. మరో విషయం ఏంటంటే ప్రస్తుతం లక్షద్వీప్‌లో ఒక్క విమానశ్రయం మాత్రమే ఉంది. 1987-88లో అగత్తి దీవుల్లో ఈ ఎయిర్‌పోర్టును నిర్మించారు. అనంతరం దశల వారిగా దీన్ని విస్తరిస్తూ వచ్చారు. అయితే కొత్త ఎయిర్‌పోర్టుపై కేంద్రం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Advertisment