Kejriwal : క్షీణిస్తున్న కేజ్రీవాల్‌ ఆరోగ్యం.. 14 రోజుల్లోనే..!

తీహార్‌ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ ఆరోగ్యం రోజరోజుకి క్షీణిస్తుందని ..14 రోజుల్లో ఆయన 4.5 కిలోల బరువు తగ్గారని ఆప్‌ మంత్రి అతిషి తన ట్విట్టర్‌ ఖాతాలో రాసుకొచ్చారు. మంగళవారం ఆయన షుగర్‌ లెవల్స్‌ భారీగా పడిపోయినట్లు తెలియడంతో ఆయనకు మెడిసిన్‌ ఇచ్చినట్లు ఆప్‌ నేతలు తెలిపారు.

New Update
Kejriwal : క్షీణిస్తున్న కేజ్రీవాల్‌ ఆరోగ్యం.. 14 రోజుల్లోనే..!

Kejriwal Health : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు(Delhi Liquor Scam) లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌(Aravind Kejriwal) ఈడీ కస్టడీ ముగిసిన తరువాత కోర్టు.. ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తుందని ఆప్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కేజ్రీవాల్‌ దాదాపు 4.5 కేజీల బరువు తగ్గినట్లు వారు తెలిపారు. మంగళవారం ఆయన షుగర్‌ లెవల్స్‌(Sugar Levels) భారీగా పడిపోయినట్లు తెలియడంతో ఆయనకు మెడిసిన్‌ ఇచ్చినట్లు ఆప్‌ నేతలు తెలిపారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ బరువు తగ్గడం గురించి వైద్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే జైలు అధికారులు మాత్రం ఆయన బరువు తగ్గలేదని జైలుకు వచ్చినప్పుడు ఎంత ఉన్నారో ఇప్పుడు అంతే ఉన్నారని తెలిపారు. షుగర్‌ లెవల్స్ కూడా తగ్గలేదని వివరించారు. దీని గురించి ఆప్‌ మంత్రి అతిషి తన ట్విట్టర్‌ లో ఇలా రాసుకోచ్చారు. ''అరవింద్ కేజ్రీవాల్ తీవ్రమైన మధుమేహ వ్యాధిగ్రస్థుడు. అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, ఆయన 24 గంటలూ దేశ సేవలో నిమగ్నమై ఉన్నారు. అరెస్ట్ అయినప్పటి నుంచి అరవింద్ కేజ్రీవాల్ బరువు 4.5 కిలోలు తగ్గింది. ఇది చాలా ఆందోళనకరం. నేడు బీజేపీ(BJP) ఆయనను జైల్లో పెట్టి ఆయన ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తోంది. అరవింద్ కేజ్రీవాల్‌కు ఏదైనా జరిగితే, దేశం మొత్తం చెప్పకుండా, దేవుడు కూడా క్షమించడు.'' అంటూ రాసుకొచ్చారు.

బుధవారం ఉదయం, ఢిల్లీ సీఎం తన సెల్‌లో యోగా, ధ్యానం చేసి, ఆపై తన బ్యారక్‌లో నడిచారని అధికారులు తెలిపారు. మార్చి 21న ఈడీ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. మరుసటి రోజు, ప్రత్యేక న్యాయమూర్తి అతన్ని మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి పంపారు. దీని తరువాత, ఏప్రిల్ 1 న కేజ్రీవాల్ కోర్టుకు చేరుకోగా, ఆయన 15 రోజుల జైలుకు పంపడం జరిగింది.

Also Read : అమెరికా రోడ్డు ప్రమాదంలో బాపట్ల విద్యార్థి మృతి!

Advertisment
Advertisment
తాజా కథనాలు