Delhi : కేజ్రీవాల్ రాజీనామా చేయకపోవడంతో హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తన సీఎం పదవికి రాజీనామా చేయకపోవడం పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ కు జాతీయ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యంలా అనిపిస్తోందంటూ..న్యాయస్థానం విమర్శలు చేసింది.

New Update
Kejriwal: 8.5కిలోల బరువు తగ్గిన కేజ్రీవాల్.. ఆందోళనలో ఆప్‌!

Kejriwal : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు(Delhi Liquor Case) లో నెల రోజులుగా జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌(CM Kejriwal) తన సీఎం పదవికి రాజీనామా చేయకపోవడం పై ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ కు జాతీయ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యంలా అనిపిస్తోందంటూ..న్యాయస్థానం మొట్టికాయలు వేసింది.

ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Admi Party) ప్రభుత్వానికి అధికారంపైనే ఆసక్తి ఉందని తెలిపింది. ఢిల్లీలోని మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందుబాటులో లేవంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించే క్రమంలో ఢిల్లీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విద్యార్థుల కష్టాలను చూసి ఢిల్లీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ నాటకాలు ఆడుతు అందర్ని నమ్మిస్తున్నారని కోర్టు కామెంట్ చేసింది.

కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ వల్ల జైలు నుంచే పాలన సాగిస్తున్నందు వల్లే ఢిల్లీ విద్యార్థులు, ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొంది. రూ.5 కోట్ల కంటే ఎక్కువ విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులను కేటాయించాలంటే ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన స్టాండింగ్ కమిటీ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. అయితే అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉండటంతో ప్రస్తుతం ఢిల్లీలో ఈ కమిటీ యాక్టివ్‌గా లేదు. ఫలితంగా విద్యార్థుల యూనిఫామ్‌లు, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్స్, స్టేషనరీకి సంబంధించిన కాంట్రాక్టుల కేటాయింపులు సకాలంలో జరిగే అవకాశం లేకుండాపోయింది.

ఈనేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన మున్సిపల్ పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫాంల పంపిణీ వ్యవహారంలో నేరుగా జోక్యం చేసుకునే అధికారం తమకు లేదని కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ బాధ్యతల్లో లోటుపాట్లు స్పష్టంగా కనిపిస్తున్నందున వాటిని వెంటనే పరిష్కరించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

Also read: ఉదయాన్నే ఈ 5 అలవాట్లు మిమ్మల్ని వ్యాధుల బారి నుంచి కాపాడతాయి

Advertisment
Advertisment
తాజా కథనాలు