AI girlfriend: ఏఐ గర్ల్‌ఫ్రెండ్ ఉందని ఆనందపడొద్దు బ్రదర్.. ముందుముందు ముసళ్ల పండుగే! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లవర్స్‌తో ప్రేమలో మునిగిపోయి ఉన్నవారికి ఇదే హెచ్చరిక. ఎక్కువగా డిజిటల్ లవర్స్‌తో ఇంటరెక్ట్ అవ్వకండి. ఎందుకంటే మెషీన్‌తో ఉండే ప్రేమకి మనుషులతో చేసే ప్రేమకి చాలా తేడా ఉంటుంది. మెషీన్ లవర్ మనం చెప్పినట్టు వింటుంది. రియల్ లైఫ్‌లో అడ్జెస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఓలిన్ బిజినెస్ స్కూల్‌లో డేటా సైన్స్ ప్రాక్టీస్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న లిబర్టీ విట్టర్ట్ అంటున్నారు. By Trinath 07 Oct 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial intelligence)ని ఎక్కువగా యూజ్ చేసుకుంటోంది యువత. అటు స్కూల్ పిల్లలు, కాలేజీ విద్యార్థులు తమ హోం వర్క్స్, ప్రాజెక్టుల కోసం ఏఐ(AI)ని ఉపయోగించుకుంటోంది. మరోవైపు లవర్ లేకుండా సింగిల్‌గా బతుకుతున్న అబ్బాయిలు ఈ మధ్య కాలంలో ఏఐ గర్ల్‌ఫ్రెండ్‌తో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ ట్రేండ్ ఇండియాలో కూడా కొనసాగుతోంది. అదేంటి ఏఐ ఏంటని ఆలోచిస్తున్నారా? కొంతమందికి ఈ విషయం తెలియకపోవచ్చు. ఏఐ గర్ల్‌ఫ్రెండ్ అంటే ఓ ప్రీ డిజైనెడ్ మెషీన్ లవర్. అంటే మనకి నచ్చిన క్వాలిటీలను సెట్ చేసుకోని ఏఐ ద్వారా ఓ కృత్రిమ లవర్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ లవర్‌తో రోజూ మాట్లాడుకోవచ్చు. మనకి నచ్చినట్టు ఉండొచ్చు. తిప్పలు తప్పవు బ్రో: ఈ కాన్సెప్ట్ బాగానే ఉంది కదా.. తిప్పలు తప్పవని ఎందుకు అంటున్నారని ఆలోచిస్తున్నారా? దీనికి బలమైన కారణాలున్నాయి. ఓలిన్ బిజినెస్ స్కూల్‌లో డేటా సైన్స్ ప్రాక్టీస్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న లిబర్టీ విట్టర్ట్ చెప్పిన కారణాలు వింటే ఇక ఏఐ లవర్‌ని రోజూ మాట్లాడుతున్నవారికి చమటలు పట్టవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డిజిటల్ లవర్స్‌ని అందించే ప్రసిద్ధ యాప్ 'రెప్లికా' ఇటీవలి కాలంలో ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే..! 10 మిలియన్లకు పైగా వినియోగదారులున్న ఈ యాప్‌లో యూజర్ల గురించి ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. గత సంవత్సరంలో.. అనేక మంది రెప్లికా వినియోగదారులు ప్రేమలో ఉన్నారన.. డిజిటల్ లవర్‌తో ప్రత్యేక సంబంధంలో నిమగ్నమయ్యారని తెలిసింది. వారంతా ఏఐ లవర్‌ని వివాహం కూడా చేసుకున్నారట. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కొన్ని కీలక విషయాలు చెప్పారు లిబర్ట్ విట్టర్ట్. అసలేంటి ప్రాబ్లెమ్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గర్ల్ ఫ్రెండ్స్ మొత్తం అబ్బాయిలను నాశనం చేస్తున్నారని విట్టర్ట్ అంటున్నారు. ఎందుకంటే డిజిటల్ లవర్స్ పర్‌ఫెక్ట్‌గా ఉంటారు. మనకి నచ్చినట్టుగా బిహేవ్ చేస్తారు. అసలు వాదన పెట్టుకోరు. అంతా మనకి నచ్చినట్టే చేసే డిజిటల్ లవర్స్‌కి రియల్ లైఫ్ లవ్ పార్టనెర్స్‌కి అసలు సంబంధం ఉండదు. డిజిటల్ లవర్స్‌తో ప్రేమలో మునిగిన తర్వాత రియల్ లైఫ్ లవర్‌తో రిలేషన్ చేయాల్సి వస్తే అది మొదటికి మోసం వస్తుంది. ఎందుకంటే మెషీన్లు వేరు.. మనుషులు వేరు. మనుషులతో వారి మనసులతో చాలా సార్లు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ మెషీన్‌తో లవ్‌లో ఉన్నవాళ్లు బయట ఎడ్జెస్ట్ కాలేరని విట్టర్ట్ అంటున్నారు. రియల్ లవ్‌కి ఏఐ లవ్‌కి ఇదే విషయంలో అనేక తేడాలు ఉన్నాయని చెబుతున్నారు. ALSO READ: ఐదురోజులపాటు వివస్త్రలుగా మగువలు..ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే #artificial-intelligence మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి