Artificial Intelligence: మానవజాతిని అంతం చేసేది ప్రళయం కాదు.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్.. ఎలా అంటే.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అంటే AI మానవజాతిని అంతం చేసేసే అవకాశాలు లేకపోలేదని లేటెస్ట్ రీసెర్చ్ చెబుతోంది. అసలు ఈ రీసెర్చ్ ఎందుకు చేశారు? AI ఎలా మానవజాతిని అంతం చేసేస్తుంది? ఇదంతా నిజమేనా అనుకోకుండా.. ఈ టైటిల్ పై క్లిక్ చేసి ఆర్టికల్ చదివేయండి.. అర్ధం అయిపోతుంది. By KVD Varma 13 Mar 2024 in ఇంటర్నేషనల్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Artificial Intelligence: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మనం ముద్దుగా పిలుచుకునే AI .. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ మాట వినిపిస్తూనే ఉంది. కరోనా మహమ్మారితో మారిపోయిన ప్రపంచ రూపురేఖల మధ్యలో.. ఇప్పుడు ఈ ఏఐ మరింత వేగంగా అన్నిరంగాల్లోనూ మార్పులను తీసుకురావడానికి రెడీ అయిపోతోంది. ఇప్పటికే మనం వాడుతున్న బైక్ లు.. కార్లు.. మనం చూస్తున్న సినిమాల్లో గ్రాఫిక్స్.. మనం చదువుతున్న పేపర్లో రాతలు.. మన ఎకౌంట్స్ వెరిఫికేషన్.. మన ఆరోగ్య లెక్కలు.. ఇలా ఒక్కటి కాదు ప్రతి చోటా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆనవాళ్లు వచ్చేశాయి. సాధారణంగా కొత్త టెక్నాలజీ రావడానికి.. దానితో మార్పు మొదలవడానికి కొద్దిగా సమయం పట్టొచ్చు.. కానీ, ఒక్కసారి అది ఎంట్రీ ఇచ్చాకా దాని అభివృద్ధికి ఎండ్ కార్డు ఉండదు.. వేగానికి కొలమానాలు ఉండవు. సరిగ్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI) కూడా అంతే. నిన్న మొన్నటి వరకూ వస్తోంది వస్తోంది అన్నారు.. ఇప్పుడు వచ్చేసింది ఉద్యోగాలు ఖాళీ చేయండి అంటున్నారు. ప్రతి విషయంలోనూ బొమ్మా..బొరుసూ ఉంటాయి. మంచీ-చెడూ రెండూ చెట్టాపట్టాలేసుకుని చిన్న గీతకు అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటీ కూచుని ఉంటాయి. ఆ సన్నని గీత మీద మనం ఉంటాం. మన బుద్ధి తిన్నగా పనిచేస్తే మంచివైపు వెళతాం.. లేకపోతే చెడువైపు చేరి చేతకాకుండా పోతాం. అదే పరిస్థితి AI ది కూడా. దీని మంచి చెడుల గురించి ఇప్పుడంతా అర్జెంట్ గా ఎందుకు చెప్పుకోవడం అంటే.. ఇటీవల అమెరికాలోని ఒక రీసెర్చ్ AIతో వచ్చే పెను ముప్పు గురించి ఒక హెచ్చరిక చేసింది. భవిష్యత్ లో AI చెప్పినట్టు మనిషి వినాల్సిన పరిస్థితి వస్తుంది అని ఆ హెచ్చరిక సారాంశం. అది విన్నాకా చాలామంది చాల్చాలు ఇలాంటివి చాలా విన్నాం. మనిషిని AI ఎలా కంట్రోల్ చేస్తుంది? మనిషి తయారు చేసిన టెక్నాలజీ కదా అని అంటారు. మొన్నామధ్య జపాన్ లో ఒక AI రోబో.. తనకు ఇన్ పుట్స్ ఇచ్చే అధికారిని చెయ్యి పట్టుకుని ఒక్క గుంజు గుంజి పక్కనే ఉన్న కన్వేయర్ బెల్ట్ లో పాడేసింది. పాపం ఆయన అక్కడిక్కకడే చనిపోయాడు. జస్ట్ ఇది వెలుగులోకి.. లేదా మనదాకా వచ్చిన ఒక కేసు మాత్రమే. నిన్నటికి నిన్న ఒక యాంకర్ ను AI రోబో తాకకూడని చోట తాకి.. యాంకర్ షాక్ అయి చూసేసరికి సారీ చెప్పింది. మనిషి చేసినవే గా ఇవి మరి ఎందుకు అలా విపరీతంగా ప్రవర్తించాయి? మన భాషలో చెప్పుకుందాం. మనందరినీ దేవుడు సృష్టించాడని అనుకుంటాం కదా. మరి మనలో కొందరు రాక్షసుల్లా ప్రవర్తిస్తారెందుకు. సింపుల్.. వారి మెదడు దేవుడు చెప్పినట్టు వినడం లేదు కాబట్టి. ఇప్పుడు దేవుడు అంటే మనిషి అనుకోండి.. AI (Artificial Intelligence)అంటే మనిషి సృష్టించిన మరో సృష్టి. మేధస్సు.. అంటే మెదడు.. అది కూడా ఒక్కోసారి మనిషి మాట వినకపోవచ్చు కదా. Also Read: కింగ్ కోబ్రాతో కోతి సరసాలు.. ఇంటర్నెట్ ను షేక్ చేసిన వీడియో! ఇప్పుడు AI మనల్ని ఎలా ముంచేయగలదు అనడానికి ఒక ఊహ చెప్పుకుందాం. ఇప్పుడు AI అన్ని చోట్ల ఉపయోగిస్తున్నారు. భవిష్యత్ లో అది మాత్రమే అన్ని చోట్లా ఉంటుంది. మన పక్కదేశ అణుబాంబు క్షిపణిని AI(Artificial Intelligence)తో కంట్రోల్ చేస్తారని అనుకుందాం.. అందులో ఒక చిన్న ప్రోగ్రామ్ ఎర్రర్ వచ్చింది అని భావిస్తే.. అప్పుడేమవుతుంది. అవసరం లేకపోయినా ఆ అణు క్షిపణి బటన్ నొక్కేస్తుంది. దాని టార్గెట్ ఢిల్లీ అయితే, అప్పుడు ఏమి జరుగుతుంది? ఇది ఆలోచించడానికి కూడా సాహసం చేయకండి.. ఎందుకంటే, ఏమవుతుందో తెలియడానికి మనదేశంతో పాటు.. పాక్.. చైనా లు కూడా నాశనం అయిపోతాయి. ఇక మెడికల్ రంగంలో.. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర.. అంతెందుకు మన ఇల్లు ఊడ్చడానికి కూడా ఇప్పుడు AI రెడీగా ఉంది. ఒక కంపెనీ చేసి ఇచ్చిన మిషన్ లో ప్రోగామ్ ఎర్రర్ వస్తే ఆ AI రోబోలు మన ఇంటి వారిని ఇరగదీసి వదిలేస్తాయి. ఇదంతా జరగదు అనడానికి లేదు.. ఛ ఊరికే సోది చెబుతున్నారు అని మీరనుకుంటే.. అక్టోబర్ 2022లో, ChatGPT ప్రయోగానికి ఇంకా ఒక నెల సమయం ఉండగానే, US ప్రభుత్వం గ్లాడ్‌స్టోన్ AIని సిద్ధం చేసింది. దీని పని ఏమిటి అంటే.. ఆయుధాలకు అమర్చిన.. AI ద్వారా ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందా? దాని ద్వారా భద్రతా వ్యవస్థకు వచ్చే బెదిరింపు ఏమిటి అనేది విశ్లేషించడం. ఒక సంవత్సరం తరువాత గ్లాడ్‌స్టోన్ AI తన విశ్లేషణ పూర్తి చేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. దానిలో ఉన్న ఒక ముఖ్యమైన వాక్యం ఏమిటంటే.. “ AI అనేది బహుశా మానవ జాతి అంతరించిపోయే స్థాయి ముప్పు తీసుకు రావచ్చు.” ముగ్గురు పరిశోధకులు ఈ నివేదికను రూపొందించారు. నివేదికను పూర్తి చేసిన ఒక సంవత్సరంలో, వారు ప్రభుత్వ అధికారులు, నిపుణులు, OpenAI, Google DeepMind, Anthropic, Meta వంటి కొన్ని ప్రముఖ AI కంపెనీల ఉద్యోగులతో సహా 200 మంది వ్యక్తులతో మాట్లాడినట్లు అందులో చెప్పారు. అదండీ విషయం.. AI(Artificial Intelligence)తో వచ్చే ముప్పు గురించి జరిపిన పరిశోధనలు చాలా స్పష్టంగా మనుషుల్ని అంతరించేలా చేసే స్థాయిలో ప్రమాదం తీసుకు వస్తాయాని విస్పష్టంగా చెప్పారు. దాంతో పాటు.. మనకు అర్ధం కాని భాషలో ఏవేవో నివారణోపాయాలు చెప్పారనుకోండి. వాటిని చేయాల్సింది కూడా ఆ AI రోబోలు చేసే కంపనీలు చేయాలి. ప్రభుత్వాలు మానిటరింగ్ చేయాలి. ప్రతి టెక్నాలజీ వెనుక ప్రమాదాలు కూడా ఉంటాయని చెప్పడమే ఈ ఆర్టికల్ ముఖ్య ఉద్దేశ్యం. #technology #artificial-intelligence మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి