Article 370 Verdict : ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. అప్పట్లో బిల్లుపై ఏ పార్టీ ఎలా వ్యవహరించిందో తెలుసా? ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు ధర్మాసనం విస్పష్టంగా తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ చర్యను సమర్ధించింది. ఈ బిల్లుపై పార్లమెంట్ లో ఏ పార్టీ స్టాండ్ ఎలా ఉంది? ఓటింగ్ సమయంలో ఎవరు సమర్ధించారు? ఈ వివరాల కోసం హెడింగ్ పై క్లిక్ చేయండి. By KVD Varma 11 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Supreme Court Verdict On Article 370 : ఆర్టికల్ 370(Article 370) ని రద్దు చేయడం, జమ్మూ కాశ్మీర్(Jammu & Kashmir) కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడం - రాష్ట్రాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా (జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్) విభజించడం వంటి చారిత్రాత్మక రాజ్యాంగ సవరణ మరియు 5 ఆగస్టు 2019 నాటి భారత ప్రభుత్వం ప్రతిపాదనపై ఈ రోజు సుప్రీంకోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. రాజ్యాంగం దృష్ట్యా అప్పటి భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంత వరకు సరైనదో సుప్రీంకోర్టు నిర్ణయించింది. అటువంటి పరిస్థితిలో, ఈ బిల్లుకు ఏ రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి? ఏ పార్టీలు వ్యతిరేకించాయో ఒకసారి గుర్తు చేసుకోవడానికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం. ఆగస్టు 5న, ఆర్టికల్ 370ని రద్దు(Article 370 Verdict) చేయాలనే భారత ప్రభుత్వ ప్రతిపాదన - రాజ్యసభలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు సుదీర్ఘ చర్చ తర్వాత ఎగువ సభ ఆమోదించింది. 125 మంది ఎంపీలు మద్దతుగా, 61 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మరుసటి రోజు ఆగస్టు 6న ఈ ప్రతిపాదన, బిల్లును లోక్‌సభలో చర్చకు ఉంచారు. ఒకరోజు చర్చ తర్వాత జమ్మూ కాశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే బిల్లు 370 ఓట్ల మద్దతుతో ఆమోదం పొందింది. 70 మంది ఈ బిల్లుకు నిరసన తెలిపి వ్యతిరేకంగా ఓటు వేశారు. అదే సమయంలో, ఆర్టికల్ 370ని దాదాపుగా రద్దు చేసి, రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేకాధికారాలను లాక్కోవాలనే ప్రతిపాదనకు దిగువ సభలో 351 మంది ఎంపీల మద్దతు లభించగా, 72 మంది ఎంపీలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు, ప్రభుత్వ చర్య అన్యాయమని రాజ్యసభలో వీరు పేర్కొన్నారు. ఎవరు మద్దతు ఇచ్చారు? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి (Article 370 Verdict)అప్పుడు కొన్ని పార్టీల మద్దతు లభించింది, ఇవి సాంప్రదాయకంగా బిజెపి పార్టీకి వ్యతిరేకంగా లేదా కొద్దిగా తటస్థ వైఖరిని అవలంబిస్తాయి. మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ, నవీన్ పట్నాయక్ బిజూ జనతాదళ్, జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్, ఎన్ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, కె చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి) 370 రద్దు బిల్లుకు మద్దతు ఇచ్చాయి. వీటితో పాటు అఖిల భారత అన్నాడీఎంకే అంటే ఏఐఏడీఎంకే, శివసేన, శిరోమణి అకాలీదళ్ కూడా ప్రభుత్వానికి మద్దతు పలికాయి. Also Read: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు – కాశ్మీర్ లో ముందస్తు జాగ్రత్తలు.. ఎవరు నిరసన తెలిపారు? భారత ప్రభుత్వ చర్యను(Article 370 Verdict) వ్యతిరేకించిన అత్యంత ప్రముఖ జాతీయ పార్టీ కాంగ్రెస్, అయితే కాలక్రమేణా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పాత వైఖరి కాస్త మెత్తబడింది. కాంగ్రెస్‌తో పాటు నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి), పీపుల్స్ కాన్ఫరెన్స్ సహా జమ్మూ కాశ్మీర్‌లోని చాలా ప్రాంతీయ పార్టీలు భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని గట్టిగా ప్రకటించాయి. అంతేకాకుండా సీపీఐ, సీపీఐఎం, డీఎంకే, ఎండీఎంకే, రాష్ట్రీయ జనతాదళ్ కూడా నిర్భయంగా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశాయి. బిల్లుకు వ్యతిరేకం అని చెప్పి.. ఓటు వేయనివారు.. నితీష్ కుమార్ పార్టీ జనతాదళ్ యునైటెడ్ (భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ) పార్లమెంట్‌లో తీసుకొచ్చిన ప్రతిపాదనను వ్యతిరేకించినప్పటికీ ఆ పార్టీ ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఓటింగ్ సందర్భంగా జేడీయూ పార్లమెంట్ నుంచి వాకౌట్ చేసింది. JDU లానే, మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కూడా ఈ అంశంపై ఉభయ సభలలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించింది, అయితే బిల్లుపై ఓటింగ్ సమయంలో, TMC ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. నేషనల్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎన్సీపీ కూడా నిరసన మార్గాన్ని ఎంచుకుని సభ నుంచి వాకౌట్ చేసింది. అయితే, ఆ సమయంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, BSP, JDU, సమాజ్‌వాదీ పార్టీ - NCP నుంచి కొంత మంది సభ్యులు తమ పార్టీ స్టాండ్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వ చర్యను మెచ్చుకోవడం విశేషం. Watch this interesting Video: #supreme-court #article-370 #supreme-court-verdict-on-article-370 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి