Ganesh Nimajjanam 2023: మద్యం తాగి నిమజ్జనానికి రావొద్దు.. 25 వేల మందితో భారీ బందోబస్తు.. సీపీ కీలక ప్రకటన

భాగ్యనగర్‌లో గణపయ్య నిమజ్జనానికి ట్రై కమిషనరేట్ల పరిధిలో ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిమజ్జనం సవ్యంగా సాగేలా పోలీసుల ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు నిర్వాహకులు. బాలాపూర్ గణేష్ మొదలుకుని హుస్సేన్ సాగర్ వరకు 19 కిలో మీటర్ల శోభాయాత్ర కొనసాగనుంది.

New Update
Ganesh Nimajjanam 2023: మద్యం తాగి నిమజ్జనానికి రావొద్దు.. 25 వేల మందితో భారీ బందోబస్తు.. సీపీ కీలక ప్రకటన

Ganesh Nimajjanam 2023: వినాయక నిమజ్జనానికి ట్రై కమిషనరేట్ల పరిధిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిమజ్జనం సవ్యంగా సాగేలా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలను నిర్వాహకులు ప్రతిష్టించారు. వినాయక నిమజ్జనానికి ట్రై కమిషనరేట్ల పరిధిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిమజ్జనం సాగేలా పోలీసుల ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలను నిర్వాహకులు ప్రతిష్టించారు. బాలాపూర్ గణేష్ హుస్సేన్ సాగర్ వరకు 19 కి.మీ శోభాయాత్ర జరగనుంది. అయితే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 25 వేల 694 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఉంచారు.  జంక్షన్‌లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో పాటు పారామిలిటరీ బలగాలతో భద్రత నిర్వహించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 6 వేల మంది పోలీసులతో భద్రత నిర్వహిస్తున్నారు. ప్రతి విగ్రహానికి ఉన్నతాధికారులు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులు వస్తే వినియోగించుకోవడానికి అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు.

పోలీసులతో భద్రత కట్టుదిట్టం

రాచకొండ కమిషరేట్ పరిధిలో గణేష్ నిమజ్జనానికి 56 చెరువుల దగ్గర ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నామని సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. నిమజ్జనాల నేపథ్యంలో క్రేన్ ఆపరేటర్ విధిగా 8 గంటలు డ్యూటీలో ఉండాలని ఆదేశించారు. రెండు క్రేన్లకు కలిపి అదనంగా మరో క్రేన్ ఆపరేటర్‌ను నియమించామన్నారు. ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ విషయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 228 పికెట్ ఏరియాలను చేపట్టామన్నారు. నిమజ్జనం సమయంలో మొబైల్ టాయిలెట్స్, ఆర్టీసీ నుంచి అదనంగా డ్రైవర్లను కూడా అందుబాటులో ఉంచామన్నారు. రూట్ టాప్, షీ టీమ్స్, మఫ్టీ పోలీసులతో భద్రత కట్టుదిట్టం చేశామని సీపీ వివరించారు.

పోలీసుల హైసెక్యూరిటీ

భక్తులు మద్యం సేవించి వినాయక నిమజ్జనానికి రావద్దని సీపీ డీఎస్ చౌహాన్ విజ్ఞప్తి చేశారు. వినాయక నిమజ్జనం కోసం 6 వేల మంది పోలీస్ సిబ్బంది ఉండగా.. మరో 1000 మంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారని వెల్లడించారు. నిమజ్జనం సందర్భంగా కమిషనరేట్ పరిధిలో కొన్ని ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయన్నారు. నిమజ్జనం కోసం సుమారుగా 3600 సీసీ కెమెరాలను వినియోగిస్తున్నామని సీపీ వెల్లడించారు. నేరేడ్‌మెట్, ఉప్పల్, నాగోల్‌లలో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశామని సీపీ డీఎస్ చౌహాన్‌ చెప్పారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment