Lokesh: ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి.. లోకేష్ కీలక వ్యాఖ్యలు ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని అన్నారు లోకేష్. అస్తవ్యస్త పాలనతో జగన్ ఖజానా ఖాళీ చేశారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు రూ.1200 కోట్లు బకాయి పెట్టారని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతతో పేదల వైద్యం గాలిలో దీపంలా మారిందన్నారు. By V.J Reddy 26 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి TDP Lokesh: సీఎం జగన్ పై మరోసారి విమర్శల దాడికి దిగారు టీడీపీ నేత లోకేష్. జగన్ అస్తవ్యస్థ పాలన వల్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని అన్నారు లోకేష్. ఆరోగ్య శ్రీ ఆసుపత్రులకు దాదాపు రూ.1200 కోట్ల బకాయలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయని.. దీని వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుతున్నారని అన్నారు. సీఎం జగన్ సొంత జిల్లాలో సైతం ఆస్పత్రిలల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయయని ఎద్దేవా చేశారు. ఏపీలో పేదోళ్లకు వైద్యం గాలిలో దీపం లా మారిందని చురకలు అంటించారు. ఆసుపత్రులను డీలిస్ట్ చేస్తూ బెదిరింపులకు రాష్ట్ర ప్రభుత్వం దిగడం దారుణమని అన్నారు. ALSO READ: ఇప్పుడు కుల గణన ఎందుకు?.. సీఎం జగన్‌కు పవన్ బహిరంగ లేఖ నిన్ను ఇంటికి పంపడానికి జనం కూడా సిద్ధం జగన్! #ChatthaRoadsChatthaCM #WhyAPHatesJagan #2024JaganNoMore pic.twitter.com/fSD6THmAZE — Lokesh Nara (@naralokesh) January 26, 2024 పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు పార్టీ మారిన టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు స్పీకర్ తమ్మినేని. ఈ నెల 29న స్పీకర్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు శాసనసభ కార్యదర్శి. 29న మధ్యాహ్నం 2.45 గంటలకు హాజరై పార్టీ మారడంపై వివరణ ఇవ్వాలని ఆదేశం ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ లిస్టులో కరణం బలరామ్, మద్దాల గిరి, వాసుపల్లి గణేశ్, వల్లభనేని వంశీకి నోటీసులు పంపారు. పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని టీడీపీ విప్ డోలా బాలవీరాంజనేయ స్వామి పిటిషన్ దాఖలు చేశారు. డోలా పిటిషన్‌పై స్పందించి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు స్పీకర్ తమ్మినేని. DO WATCH: #lokesh #cm-jagan #ap-latest-news #aarogyasri-card #arogya-sree-services-stopped-in-ap మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి