ARMY JAWAN: స్వగ్రామానికి రామకృష్ణ రెడ్డి భౌతిక కాయం.. ప్రభుత్వ లాంచనాలతో మట్టి కార్యక్రమం

కశ్మీర్ లడక్‌లో ఆర్మీ రిహార్సల్స్ లో మృతి చెందిన ప్రకాశంజిల్లా కాల్వపల్లె గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ రామకృష్ణ రెడ్డి భౌతిక కాయం స్వగ్రామానికి చేరింది. గన్నవరం ఎయిర్ పోర్టులో గణ నివాళి అర్పించారు ప్రముఖులు. మంగళవారం అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.

New Update
ARMY JAWAN: స్వగ్రామానికి రామకృష్ణ రెడ్డి భౌతిక కాయం.. ప్రభుత్వ లాంచనాలతో మట్టి కార్యక్రమం

Ramakrishna Reddy: కశ్మీర్ లడక్ లో జరిగిన ఆర్మీ రిహార్సల్స్ లో రెండు రోజులక్రితం మృతి చెందిన ప్రకాశంజిల్లా కాల్వపల్లె గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ ముత్తుమూల రామకృష్ణ రెడ్డి భౌతిక కాయం స్వగ్రామానికి చేరింది. గన్నవరం ఎయిర్ పోర్టులో వీర జవాన్ కు గణ నివాళి అర్పించారు ప్రముఖులు. వీరుడి భౌతిక కాయానికి గౌరవ వందనం చేసిన అనంతరం స్వగ్రామానికి ప్రభుత్వ లాంచనాలతో తరలించారు. మంగళవారం అధికారిక లాంచనాలతో మట్టి అంత్యక్రియలు జరగనున్నాయి. రామకృష్ణ రెడ్డి మృతితో కుంటుంబ, బంధువులు శోకసంద్రంలో మునిగితేలారు. 'చిన్ననాటి నుండే మాకు దేశ భక్తిపట్ల ప్రేమ నేర్పించాడు. మాకు మా నాన్నే హీరో. ఆయన స్పూర్తితోనే నేను మర్చంట్ నేవీలో చేరాను' అని రామకృష్ణ రెడ్డి పెద్ద కుమారుడు రవికాంత్ రెడ్డి కన్నీటిపర్యంతమయ్యాడు.

అలాగే శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో కృష్ణాజిల్లా పెడన మండలం చేవేండ్ర గ్రామానికి చెందిన జవాను సాదరబోయిన నాగరాజు కూడా (32) మృతిచెందారు. చేవేండ్ర ఉప్పరగూడెం ప్రాంతానికి చెందిన సాదరబోయిన వెంకన్న పెద్దకుమారుడైన నాగరాజు ఎనిమిదేళ్ల క్రితం ఆర్మీలో చేరారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

New Update

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

మొత్తం 28 మంది..

ఇదిలా ఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.  

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

Advertisment
Advertisment
Advertisment