Breakup : బ్రేకప్ చేసుకున్న బాలీవుడ్ స్టార్ జంట.. కారణం అదేనా? కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తూ విచ్చలవిడిగా తిరిగిన అర్జున్ కపూర్ - మలైకా అరోరా బ్రేకప్ చెప్పుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారని బాలీవుడ్ అంతటా జోరుగా ప్రచారం జరుగుతుంది. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. By Anil Kumar 31 May 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Arjun Kapoor - Malaika Arora Breakup : బాలీవుడ్ లవ్ బర్డ్స్ బ్రేకప్ చేసుకున్నారట. ప్రెజెంట్ ఈ న్యూస్ బీ టౌన్ లో మారు మోగిపోతుంది. కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తూ విచ్చలవిడిగా తిరిగిన అర్జున్ కపూర్ - మలైకా అరోరా బ్రేకప్ చెప్పుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారని బాలీవుడ్ అంతటా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఈ లవ్ బర్డ్స్ ఎందుకు విడిపోయారు? పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రేకప్ అయినా ఆ స్థానం ఎప్పటికీ అలాగే.. నేషనల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. ఇండస్ట్రీ కి చెందిన ఓ వ్యక్తి అర్జున్, మలైకా ల బ్రేకప్ పై స్పందిస్తూ.." అర్జున్, మలైకా మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. బ్రేకప్ తర్వాత కూడా వాళ్ళు ఆ బంధాన్ని కంటిన్యూ చేస్తారు. ఒకరి మనసులో ఒకరికి ప్రత్యేక స్థానం అలాగే ఉంటుంది. బ్రేకప్ గురించి మాట్లాడేందుకు వాళ్ళు సముఖంగా లేరు. దీని గురించి చర్చ జరగడం కూడా వాళ్లకు ఇష్టం లేదు" అని తెలిపాడు. Also Read : ‘ఉప్పెన’ డైరెక్టర్ ఇంట్లో తీవ్ర విషాదం..! కాగా 2019 లో అర్జున్ కపూర్ - మలైకా అరోరా రిలేషన్ లో ఉన్నట్లు తెలిపారు. అప్పట్నుంచి బయట పార్టీలు, ఫంక్షన్స్ అని విచ్చలవిడిగా తిరుగుతూ వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేవారు. అంతేకాదు అర్జున్ కపూర్ మలైకా కంటే 12 ఏళ్ళు చిన్నవాడు. ఈ విషయంలో మలైకా పై పలు విమర్శలు రావడంతో ప్రేమకి వయసుతో పనేంటని గట్టిగా కౌంటర్ ఇచ్చింది. సుమారు 5ఏళ్ల పాటూ డేటింగ్ లో ఉన్న ఈ జంట ఇదే ఏడాది పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఆ మధ్య న్యూస్ వచ్చింది. అలాంటిది ఉన్నట్టుండి ఇలా బ్రేకప్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. #malaika-arora #arjun-kapor-malaika-arora-breakup #arjun-kapoor మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి