Abhaya Case : అనాథ శవాలతో వ్యాపారం.. కోల్‌కతా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ అక్రమాలివే!

ఆర్జీ కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్‌ పై సందీప్‌ ఘోష్‌ అవినీతి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అనాథ శవాలను అమ్మి సొమ్ము చేసుకునేవాడని, ఫెయిలయిన విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుని పాస్ చేసే వాడని.. సిబ్బంది ఆరోపిస్తున్నారు.

New Update
Kolkata Tragedy: కోల్‌కతా అత్యాచారం-హత్య కేసు.. మాజీ ప్రిన్సిపాల్ ఇంటిపై సీబీఐ దాడులు

RG Kar Medical College : కోల్‌కతా (Kolkata) ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ ఘోష్‌ (Sandeep Gosh) పై అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సందీప్ ప్రిన్సిపల్‌ గా ఉన్న సమయంలో అనాథ శవాలను కూడా అమ్మేశాడని, వాడేసిన సిరంజులను , ఇతర వైద్య సామాగ్రిని కూడా రీ సైక్లింగ్‌ చేసి సొమ్ము చేసుకునే వాడని విచారణలో తెలిసింది.

పోయిన సంవత్సరం వరకు ఇదే కాలేజీలో పని చేసి, ప్రస్తుతం ముర్షిదాబాద్‌ డిప్యూటీ మెడికల్‌ కాలేజీ సూపరింటెండెంట్‌గా ఉన్న అక్తర్‌ అలీ సిట్ విచారణలో ఈ సంచలన విషయాలను తెలిపినట్లు సమాచారం. వైద్యురాలి హత్యాచారంపై ఏర్పాటైన సిట్‌ ఇటీవల అక్తర్‌ అలీని విచారణకు పిలిపించిన సంగతి తెలసిందే. ఆయన ఫిర్యాదుల ఆధారంగా సందీప్‌ పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

2023 జులై 14న అలీ రాసిన లేఖ ప్రకారం, ఆసుపత్రి ఆస్తులను కాలేజీ కౌన్సిల్‌ లేదా స్వాస్త్‌ భవన్‌ అనుమతులు లేకుండానే సందీప్‌ ప్రైవేట్‌ వ్యక్తులకు లీజుకు ఇచ్చేవాడు. ఇక వైద్యశాలకు అవసరమైన పరికరాలు, ఔషధాల సరఫరాదారుల ఎంపికలో కూడా తనకి కావాల్సిన వారికి మాత్రమే ఇచ్చేవాడని తెలిసింది. కోట్ల రూపాయల విలువైన కొటేషన్ల విషయంలో కుమ్మక్కై అనర్హులకు అప్పజెప్పాడు.

ఇక సరఫరాదారుల నుంచి 20 శాతం కమిషన్‌ పుచ్చుకొనేవాడని సందీప్‌ పై అలీ ఆరోపించాడు. దీంతోపాటు పరీక్షలు తప్పిన విద్యార్థుల నుంచి కూడా డబ్బులు తీసుకుని వారిని పాస్ చేసేవాడని సమాచారం. అనాథ శవాలు, వినియోగించిన సిరంజ్‌లు, సెలైన్‌ బాటిల్స్‌, రబ్బర్‌ గ్లౌజులు వంటివి ఆసుపత్రిలో ప్రతీ రెండు రోజులకు 500-600 కిలోలు వరకు పోగయ్యేవి.

వాటిని ఇద్దరు బంగ్లాదేశీవాసుల సాయంతో ఘోష్‌ రీసైక్లింగ్‌ చేయించేవాడని, ఇదే అంశంపై అలీ అప్పట్లోనే విజిలెన్స్‌ కమిషన్‌, ఏసీబీ, హెల్త్‌ డిపార్ట్‌మెంట్లకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Also Read : రోస్టర్ బెంచ్ ముందుకు రాహుల్ గాంధీపై పౌరసత్వ పిటిషన్!

Advertisment
Advertisment
తాజా కథనాలు