Telegram: టెలిగ్రామ్ లో సినిమా చూస్తున్నారా? బీ కేర్ ఫుల్.!

టెలిగ్రామ్ లో సినిమాలు చూసేవారికి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సైబర్ దోస్త్ హెచ్చరికలు జారీ చేసింది. కొత్త సినిమాలకు థంబ్‌నైల్స్ పెట్టి సైబర్ లింకులను అటాచ్ చేస్తున్నారని తెలిపింది. ఆ లింక్స్ ఓపెన్ చేయగానే సైబర్ నేరగాళ్లకు మన సమాచారం అంతా వెళ్తుందని పేర్కొంది.

New Update
Telegram: టెలిగ్రామ్ లో సినిమా చూస్తున్నారా? బీ కేర్ ఫుల్.!

Cyber Dost: కొత్త సినిమా వస్తే చాలు ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తు ఉంటారు సిని లవర్స్. అయితే, ఈ మధ్య కాలంలో చాలా మంది థియేటర్స్ కంటే ఓటీటీ (OTT) కల్చర్ కు బాగా అలవాడు పడ్డారు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ (Web Series) లు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండడంతో నెటిజన్లు ఓటీటీలో వచ్చే వాటిపైనే ఆసక్తిని పెంచుకుంటున్నారు. అయితే, వీటిని చూసేందుకు చాలా మంది టెలిగ్రామ్ లో జాయిన్ అవుతున్నారు. ఓటీటీలో ఎదైనా కొత్త సినిమా గానీ, వెబ్ సిరీస్ గానీ రిలీజ్ అయిన వెంటనే.. సంబంధిత ప్లాట్ ఫామ్ లో సబ్ స్రినషన్ లేకున్నా..టెలి గ్రామ్  లో ప్రత్యక్షమవుతుంది. దీంతో, యూజర్లు టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరిపోతున్నారు.

Also Read: డిగ్రీ, పీజీ పట్టాలు పొందిన 17 మంది జీవిత ఖైదీలు.!

అయితే, సొమ్ము కాజేయడానికి సైబర్ మోసగాళ్లు ఈ విధంగా రంగంలోకి దిగుతున్నారు. రిలీజ్ అయిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లకు థంబ్‌నైల్స్ పెట్టి..టెలిగ్రామ్ వంటి గ్రూపుల్లో (Telegram Groups) సైబర్ లింకులను (Cyber Links) అటాచ్ చేస్తున్నారు. ఫ్రీగా సినిమాను చూడాలంటే యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచిస్తుంది. దాని ఫాలో అయి లింక్ క్లిక్ చేస్తే అంతే..ఖాతా ఖాలీ అయినట్లే. ఆ లింక్స్ ఓపెన్ చేయగానే వారి సమాచారం అంత సైబర్ నేరగాళ్లకు వెళ్తుంది. ఇలా అమాయకుల ఖాతాల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు సైబర్ మోసగాళ్లు.

ఈ మధ్య ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించిన కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సైబర్ దోస్త్ (Cyber Dost)..యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. టెలిగ్రామ్ ద్వారా ఇచ్చే లింక్‌ ల నుంచి ఎలాంటి యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకోవద్దని సూచిస్తోంది. తెలియని లింక్ లను ఓపెన్ చేసి, డబ్బులు పోగొట్టుకోవద్దని అప్రమత్తం చేసింది.

Also Read: దుబాయ్‌ లో మహేష్‌..జపాన్‌ లో జూనియర్‌ ఎన్టీఆర్‌..అల్లు అర్జున్‌…ఎక్కడంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు