Health Tips: మజ్జిగలో ఉప్పు కలిపి తీసుకుంటున్నారా ? .. అయితే, ఇది మీకోసమే మనలో చాలామందికి మజ్జి తాగడం అలవాటుగా ఉంటుంది. అయితే, మజ్జిగలో ఉప్పు కలుపుకొని తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉప్పు లేకుండా మజ్జిగ తాగితే ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు. By V.J Reddy 02 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Buttermilk With Salt: మనలో చాలా మందికి అన్నం తిన్న వెంటనే మజ్జిగ తాగే అలవాటు ఉంటుంది. మజ్జిగ తాగడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మంచిగా పనిచేస్తుందని అంటుంటారు. మరి కొందరు చలువ చేస్తుందని అంటారు. అలాగే శరీరంలో వేడిని తగ్గిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఆహారం తీసుకున్న తరవాత మజ్జిగను తాగడం వల్ల జీర్ణక్రియ మంచిగా పనిచేయడం జరుగుతుందని.. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, లాక్టిక్ యాసిడ్ జీవక్రియను మెరుగుపరుస్తాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు. అయితే, మజ్జిగలో ఉప్పు కలుపుకొని తాగడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా సరైన మోతాదులో తీసుకుంటేనే మంచిదని వైద్యులు తెలుపుతున్నారు. ALSO READ : BRS మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కేసు నమోదు రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మజ్జిగను ఉప్పు లేకుండా తీసుకోవడం మన ఆరోగ్యానికి మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. మజ్జిగలో చాలా పోషకాలుంటాయని.. పొటాషియం, విటమిన్ బి12, కాల్షియం, ఐరన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ గుణాలు మనల్ని అనారోగ్యం బారిన పడకుండా ఉంచడానికి సహాయపడతాయని తెలుపుతున్నారు. ఎండా కాలంలో మజ్జిగ తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ALSO READ: రాక్షస పాలనలో అమ్మాయిలకు రక్షణ లేదు.. జగన్ పై లోకేష్ ఫైర్ మజ్జిగను ఉప్పుతో కలిపిన తాగడం వల్ల మన శరీరంలో నీరసం, అలసటి, పొట్ట భారంగా అనిపించడం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాగే మజ్జిగను తాగడం వల్ల జీర్ణవ్యవస్థ చురుకుగా ఉంటే పేగులలోని మంచి బ్యాక్టీరియా చనిపోతుందని వైద్యులు అంటున్నారు. కాబట్టి, మజ్జిగలోకి ఉప్పును కలిపి తీసుకోవడంతగ్గించాలని సూచిస్తున్నారు. పుల్లగా ఉండే పెరుగులో ఎన్నో రకాల ఆమ్ల పదార్థాలు ఉంటాయి... ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రయోజనాలు సక్రమంగా శరీరానికి అందాలంటే ఉప్పు లేకుండా మజ్జిగ, పెరుగు తీసుకోవాలని పేర్కొన్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-tips #curd-effects #telugu-health-tips #butter-milk #effects-of-butter-milk మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి