Bottle Gourd: సోరకాయ తింటే అనారోగ్యమా? సోరకాయ, ఆనికాయ చాలా మంది స్పైసీ నుండి రైతా వరకూ స్వీట్స్‌లోనూ బాగా వాడతారు. దీంతో చేసే వంటలు ఎంతో రుచిగా ఉండడమే కాకుండా అంతే ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు నిపుణులు. అవి ఏంటి.. ఎప్పుడు వస్తాయో ఇప్పుడు చూద్దాం.. By Durga Rao 28 Jun 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Bottle Gourd : సోరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. బరువు తగ్గాలని ప్రయత్నించాలనుకునేవారు దీనిని తమ డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల బరువు తగ్గేందుకు మేలు చేస్తుందని చెబుతున్నారు. అదే విధంగా ఈ కాయను తినడం వల్ల డీహైడ్రేషన్, మలబద్ధకం వంటివి కూడా దూరమవుతాయని చెబుతున్నారు. సోరకాయలో కొన్ని విషపదార్థాలు కూడా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ఇందులో కుకుర్బిటాసిన్ అనే విషపూరిత టెట్రాసైక్లిక్ ట్రైటెర్ పెనాయిడ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇది చేదుగా ఉండడమే కాకుండా విషపూరితంగా మారతాయి. ఈ సోరకాయ మొక్క అనేది శాకాహారం తినే జంతువులకి వ్యతిరేకంగా తనని తాను కాపాడుకునేందుకు ఈ విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటివరకూ దీని విరుగుడు లేదు. చేదు రుచితో కూడిన సోరకాయ శరీరంలో అనేక సమస్యలకు కారణమవుతుంది. దీనిని తినడం వల్ల కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, హెమటేమిసిస్ వంటి ప్రమాదాలకు కారణమవుతుంది. కాబట్టి సోరకాయ రసం చేదుగా అనిపిస్తే దానిని తీసుకోకపోవడమే ఉత్తమం. ఓ పరిశోధన ప్రకారం సోరకాయ తీసుకున్న వెంటనే కొన్ని విషపూరిత లక్షణాలు కనిపిస్తాయి. అవి వాంతులు, అతిసార, జీర్ణ సమస్యలు, హైపోటెన్షన్. Also Read: గోర్లు అదే పనిగా పెంచుతున్నారా..? ఈ ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోండి #health-tips #health-benefits మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి