ISRO: ఇస్రో సైంటిస్టుల ఎనర్జీ సీక్రేట్‌ మసాలా దోస.. ఇది చదివితే మీరు కూడా ఆ టైమ్‌లో తింటారు!

చంద్రయాన్‌ -3 సక్సెస్‌లో మసాలా దోస, ఫిల్టర్‌ కాఫీ పాత్రపై చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ వెంకటేశ్వర శర్మ వివరించారు. ప్రతి రోజు సాయంత్రం 5 గంటలకు ఇస్రో సిబ్బంది అందరికీ మసాలా దోస, ఫిల్టర్ కాఫీని అందించేవారట. అవి తిని, తాగిన తర్వాత ఎనర్జీ పెరిగి అదనపు టైమ్‌ కూడా పనిచేసేవాళ్లమని శర్మ చెప్పారు.

New Update
ISRO: ఇస్రో సైంటిస్టుల ఎనర్జీ సీక్రేట్‌ మసాలా దోస.. ఇది చదివితే మీరు కూడా ఆ టైమ్‌లో తింటారు!

Masala dosa and filter coffee the secret behind Chandrayaan-3 Mission success: ఇస్రో(Isro) దూసుకుపోతోంది. చంద్రయాన్‌-3, ఆదిత్య ఎల్‌-1(Aditya L1) ప్రయోగాలతో చంద్రుడు, సూర్యుడిపై రహస్యాలను తెలుసుకుంటోంది. జాబిల్లిపై చంద్రయాన్‌ ల్యాండర్‌ దిగింది ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల 04నిమిషాలకు.. అది జరిగి పది రోజులు కూడా గడవకముందే నేరుగా సూర్యుడిపైనే గురిపెట్టింది ఇస్రో. ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ని ఇవాళ(సెప్టెంబర్‌ 2) ప్రయోగించింది. ఇలా ఒకదాని తర్వాత మరొక ప్రయోగం చేస్తున్న ఇస్రో సైంటిస్టులకు ఎనర్జీ ఎక్కడ నుంచి వస్తుందో తెలుసా? సచిన్‌, సెహ్వాగ్‌, కోహ్లీకి బూస్ట్ ఎనర్జీ ఇవ్వడం అన్నది కేవలం అడ్వర్‌టైజ్‌మెంట్ మాత్రమే.. కానీ ఇస్రో సైంటిస్టులకు నిజంగానే రెండు ఎనర్జీ సీక్రెట్‌లు ఉన్నాయి. అందులో ఒకటి మసాలా దోస.. రెండోది.. ఫిల్టర్‌ కాఫీ..!

రోజు సాయంత్రం 5గంటలకు:
ఇస్రోలోని మిషన్ సైంటిస్ట్ వెంకటేశ్వర శర్మ 'వాషింగ్టన్ పోస్ట్‌'(Washington post)తో మాట్లాడుతూ, "ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఉచిత మసాలా దోస, ఫిల్టర్ కాఫీని అందించడం మా ఎనర్జీకి కారణం.' ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు చంద్రయాన్‌-3 టీమ్‌కి మసాలా దోస, ఫిల్టర్ కాఫీని ఇచ్చేవారట. మార్నింగ్‌ నుంచి వర్క్‌ చేస్తున్న టీమ్‌కి ఆ సమయంలో ఎనర్జీ లెవల్స్‌ పడిపోయేవి. సరిగ్గా అదే టైమ్‌లో దోసతో పాటు కాఫీ వచ్చేది. దీంతో ఒక 30 మినిట్స్‌ బ్రేక్‌ తీసుకోని.. దోస తినేసి.. ఫిల్టర్‌ కాఫీ తాగేసి మళ్లీ సీటులోకి వచ్చి కూర్చునేవారు. అప్పటివరకు లేని ఎనర్జీ ఒక్కసారిగా వారి బాడీలోకి వచ్చేది. దీంతో మరింత ఉత్సాహంతో పని చేసేవాళ్లు. మిషన్ సైంటిస్ట్ వెంకటేశ్వర శర్మ ఈ విషయాలను పంచుకున్నారు.

ఆదిత్య L1 మిషన్ ప్రధాన లక్ష్యాలు:
మరోవైపు ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ ఇవాళ(సెప్టెంబర్ 2) ఉదయం దూసుకెళ్లింది. మిషన్ ప్రాథమిక లక్ష్యం రోజులో 24 గంటలు సూర్యుడిని గమనించే సామర్థ్యాన్ని పెంచడం. ఇది సూర్యుడి కార్యకలాపాలను నిశితంగా పరిశీలించడంలో సహాయపడుతుంది. దాని సాధన కోసం.. ఆదిత్య L1 ఐదు చిన్న పరికరాలతో పాటు రెండు ప్రధాన పరికరాలను కలిగి ఉంది. SUIT (అల్ట్రా వయొలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్), సూర్యుని నిరంతర చిత్రాలను సంగ్రహించే అతినీలలోహిత ఇమేజర్. పరిశీలనలు చేయడానికి అతినీలలోహిత వర్ణపటం ముఖ్యమైనది. దీని ప్రాముఖ్యతకు కారణం సూర్యుని కరోనా నుంచి విడుదలయ్యే అతినీలలోహిత ఎక్స్-రే రేడియేషన్ పెద్ద మొత్తం. మరొక ప్రధాన పరికరం VELC. ఇది సూర్యుని కరోనా-సూర్యుని వాతావరణ బయటి పొరపై దృష్టి సారించే స్పెక్ట్రోగ్రాఫ్. ముఖ్యంగా.. ఇది సూర్యుడిని కనిపించే డిస్క్‌కి మించి విస్తరించి ఉంది. VELC SUITతో పాటు కరోనాను కూడా పర్యవేక్షిస్తుంది. సూర్యుడి ఉపరితలంపై జరిగే ఘటనలతో కరోనాలో మార్పులను పరస్పరం అనుసంధానించడానికి ఇస్రో శాస్త్రవేత్తలను అనుమతిస్తుంది.

ALSO READ: అక్కడ నుంచి చూస్తే సూర్యుడు తెల్లగా కనిపిస్తాడు.. సన్‌ గురించి ఆసక్తికర విషయాలివే!

#chandrayaan-3 #aditya-l1-isro
Advertisment
Advertisment
తాజా కథనాలు