APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది. గ్రూప్-2 మెయిన్స్ దరఖాస్తులో పోస్టుల ప్రాధాన్యత, పరీక్ష కేంద్రం ప్రాధాన్యతలను మార్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఒకసారి ఎడిట్ చేసి సబ్మిట్ చేస్తే మార్చుకోవడానికి అవకాశం ఉండదని స్పష్టం చేసింది.

New Update
APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్

APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది. గ్రూప్-2 మెయిన్స్ దరఖాస్తులో పోస్టుల ప్రాధాన్యత, పరీక్ష కేంద్రం ప్రాధాన్యతలను మార్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. పోస్టుల ప్రాధాన్యత, పరీక్ష కేంద్రాల మార్పులు, జోన్ల ప్రధాన్యత మార్చుకునేందుకు ఈ నెల 25వ తేదీ రాత్రి 11.59 వరకు అవకాశం ఇస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

ఒకసారి ఎడిట్ చేసి సబ్మిట్ చేస్తే మార్చుకోవడానికి అవకాశం ఉందని స్పష్టం చేసింది. అభ్యర్థుల నుంచి పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు రావడంతో ఎడిట్ ఆప్షన్ ఇచ్చామని అధికారులు తెలిపారు. ఇదే చివరి అవకాశమని ఇకపై సవరణలకు అవకాశం ఉండదని వివరించింది. ఏపీ గ్రూప్-2 ప్రిలిమ్స్ రిజల్ట్స్‌ను ఏపీపీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. మెయిన్స్ కు క్వాలి ఫై అయిన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో ఉన్నాయి.

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు మొత్తం 92,250 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25న గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. వివిధ కారణాలతో 2557 మంది అభ్యర్థులను రిజెక్ట్ చేశారు. గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ కు రాష్ట్ర వ్యాప్తంగా 4,83,525 మంది అభ్యర్థులు రిజిస్టార్‌ చేసుకోగా, 4,63,517 మంది హాల్ టిక్కెట్లను పొందారు. 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షకు 87.17% శాతం మంది హాజరయ్యారని ఏపీపీఎస్సీ (APPSC)తెలిపింది. ఏపీలోని 24 జిల్లాల్లోని 1327 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది.

ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను జులై 28న నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ లో రెండు పేపర్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. మొత్తం 300 మార్కులకు పరీక్షలను నిర్వహిస్తారు. ఒక్కొక్కటి 150 మార్కులు కేటాయించారు. ప్రతి సెక్షన్ కు 75 మార్కులు కేటాయించారు.

Also read: హజ్‌ యాత్రలో ఎండవేడికి 90 మంది భారతీయులు మృతి!

#groups #edit-option #appsc
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబ...

Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

ఏపీ సర్కార్ మైనరిటీల కోసం కొత్త పథకం తీసుకొచ్చింది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. చిన్నతరహా యూనిట్ల ఏర్పాటుకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకూ సబ్సిడీపై రుణాలు పొందవచ్చు. ఈ నెల 25 నుంచి దరఖాస్తు ప్రారంభం అయ్యింది.

New Update
cm chandra babu

cm chandra babu

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మైనారిటీల అభివృద్ధే ధ్యేయంగా వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. వ్యవసాయం, రవాణా, అనుబంధ రంగాలు, సేవా, వ్యాపార, పరిశ్రమ రంగాలలో స్వయం ఉపాధి పథకాల కోసం రుణాలు అందిస్తుంది. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

ఈ పథకం ద్వారా మైనారిటీ నిరుద్యోగ యువతకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు రుణం ఇస్తారు. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా మైనారిటీ సంక్షమ శాఖ రిలీజ్ చేసింది. ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, కార్పెంటరీ వంటి వాటిలో కూడా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. కాగా ఇటీవల కూటమి ప్రభుత్వం ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.173.57 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

మైనారిటీ నిరుద్యోగ యువతకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఈ నిధులను అందించనున్నారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. ఏప్రిల్ 25 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా వచ్చే నెల అంటే మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

అర్హతలు

ఆసక్తిగల దరఖాస్తు దారుడు మైనారిటీ వర్గానికి (ముస్లిం, క్రైస్తవులు, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్సీలు) చెందినవాడై ఉండాలి. 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అయి ఉండాలి.

21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో ఏడాదికి రూ.2,00,000, గ్రామీణ ప్రాంతాలలో రూ.1,50,000 ఉండాలి. 

ఎవరైతే ఈ పథకానికి అప్లై చేయాలనుకుంటున్నారో.. స్వయం ఉపాధి పథకాల రవాణా రంగానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

జనరిక్ ఫార్మసీ పథకాలకు డి.ఫార్మసీ / బి.ఫార్మసీ / ఎం.ఫార్మసీ అర్హత కలిగి ఉండాలి.

https://apobmms.apcfss.in/  లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. https://apobmms.apcfss.in/RegistrationForm రిజిస్ట్రేషన్ ఫామ్‌లో డీటెయిల్స్ నింపాలి.

andhra-pradesh | cm-chandra-babu | ap-govt | ap-govt-schemes

Advertisment
Advertisment
Advertisment