Onions: పచ్చి ఉల్లిపాయలను ఇలా రాస్తే ముఖంపై మొటిమలు మాయం

ఉల్లిపాయ వంటకాల్లో రుచిని పెంచడంతోపాటు మొటిమలకు అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్‌ మొటిమలను తొలగిస్తుంది. దీన్ని మొటిమలపై రాస్తే ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, బ్యాక్టీరియల్‌ లక్షణాలు మొటిమలతో పాటు చర్మంపై ఎరుపును కూడా తగ్గిస్తాయి.

New Update
Onions: పచ్చి ఉల్లిపాయలను ఇలా రాస్తే ముఖంపై మొటిమలు మాయం

Onions: ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదంటారు. అయితే ఉల్లిపాయ వంటకాల్లో రుచిని పెంచడమే కాకుండా మొటిమలకు కూడా అద్భుతంగా పనిచేస్తుందని నిరూపితమైంది. చర్మం శుభ్రంగా, అందంగా కనిపించేలా చేస్తుంది. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్‌ మొటిమలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా చర్మాన్ని మృదువుగా మారుస్తుందని చెబుతున్నారు. క్వెర్సెటిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ ఉల్లిపాయలో ఉంటుందని, ఇది వాపును తగ్గించడంలో కూడా బాగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ఉల్లిపాయ రసం:

  • ఉల్లిపాయను మెత్తగా రుబ్బుకుని దాని రసాన్ని తీసుకోవాలి. దీన్ని నేరుగా మొటిమలపై రాయడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు మొటిమలతో పాటు చర్మంపై ఎరుపును కూడా తగ్గిస్తాయి.

ఉల్లిపాయ-తేనె మాస్క్:

  • తేనె, ఉల్లిపాయలు కలిపి మంచి ఫేస్‌ మాస్క్‌ని తయారు చేసుకోవచ్చు. తేనెలోని మాయిశ్చరైజింగ్‌, యాంటీ సెప్టిక్‌ గుణాలు చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. అంతేకాకుండా మచ్చలు, మొటిమలు అన్ని తొలగిపోతాయి.

ఉల్లిపాయ పేస్ట్:

  • ఉల్లిపాయను గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేసి నేరుగా మొటిమల మీద రాయాలి. తర్వాత కొన్ని నిమిషాలు అలాగే ఉంచి కడిగేసుకోవాలి. దీంతో ముఖానికి ఎంతో మెరుపు వస్తుంది. మలినాలు అన్నీ తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

ఉల్లితో కొత్త జుట్టు:

  • కేవలం ముఖానికే కాకుండా ఉల్లిపాయ రసం జుట్టుకు కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఉల్లిపాయ రసాన్ని ఏదైనా నూనెతో కలిపి జుట్టుకు రాసుకోవడం వల్ల జుట్టు తెలబడదు, అంతేకాకుండా ఊడిన చోట కొత్త జుట్టు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే జుట్టు కుదుళ్లకు కూడా ఎంతో ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్‌ తలలోని రక్త సరఫరాను మెరుగుపరుస్తుందని దీని వల్ల కొత్త జుట్టు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఏ వయసువారు ఎన్ని గంటలు నడవాలి?..నిపుణులు ఏమంటున్నారు?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు