Apple: ఐఫోన్లలో స్పైవేర్..92 దేశాల్లో యూజర్లకు ముప్పు

ఐఫోన్ వాడుతున్నారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది ఆపిల్ సంస్థ. స్పైవేర్‌లు అటాక్ చేస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ఇంకా ఇతర నాయకులు తమ ఫోన్లు హ్యాక్ అవుతున్నాయని చెప్పిన నేపథ్యంలో మొత్తం 92 దేశాలకు హ్యాకర్ల బెడద ఉందని ఆపిల్ చెబుతోంది.

New Update
Apple: ఐఫోన్లలో స్పైవేర్..92 దేశాల్లో యూజర్లకు ముప్పు

ఆపిల్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది సంస్థ. కొంమంది కిరాయిదారులు స్పైవేర్‌లతో అటాక్ చేస్తున్నారని చెబుతున్నారు. వ్యక్తిగతంగా కూడా ఆ దాడులు జరుగుతున్నాయని చెప్పింది. ఈ స్పైవేర్ దాడులు చాలా డేంజరస్‌ అని..సైబర్ నేరాలు, మాల్వేర్ పంక్షన్ల కంటే కిష్టమైనవి అని చెబుతున్నాయి. ఇండియాలో కాంగ్రెస్ మరికొంత నేతల ఫోన్లు హైజాకింగ్ కు ఇవే కారణమని అంటోంది. పెగాసస్ లాంటి స్పైవేర్‌లను కూడా వీరే సృష్టిస్తున్నారని చెబుతోంది. దీనికి సంబంధించి తమ వినియోగదారులకు నోటిషికేషన్లను పంపిస్తున్నామని తెలిపింది.

అయితే ఈ స్పైవేర్ దాడులను ఎవరి మీద ఎప్పుడు చేస్తున్నారనే విషయం మాత్రం ఇంకా కనిపెట్టలేకపోతున్నామని అంటోంది ఆపిల్ కంపెనీ. ఈ దాడులు చేసేవారు కొంతమందినే లక్ష్యంగా చేసుకుంటున్నారని చెబుతోంది. దీని కోసం మిలియన్ డాలర్లుకూడా ఖర్చు పెడతున్నారని చెప్పింది. అయితే ఇవి కొంచెం బడా వ్యక్తులనే లక్ష్యంగా చేసుకుని జరుగుతున్నాయని చెప్పింది. చారిత్రాత్మకంగా NSO గ్రూప్ నుండి పెగాసస్ వంటి వారి తరపున మెర్సెనరీ స్పైవేర్‌ను అభివృద్ధి చేస్తున్న ప్రైవేట్ కంపెనీలతో సహా రాష్ట్ర నటులతో సంబంధం కలిగి ఉన్నాయి ఆపిల్ అంటోంది.

జర్నలిస్టులు, రాజకీయనాయకులు లాంటి వారి మీద స్పైవేర్ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని ఆపిల్ చెబుతోంది. 2021 నుంచి మేము ఈ దాడులను గుర్తిస్తున్నామని తెలిపింది. అప్పటి నుంచే మేము చాలా సార్లు దీనికి సంబంధించి నోటిఫికేషన్లు పంపుతున్నామని చెప్పింది. ఇలా మొత్తం 150 దేశాల్లో హెచ్చరికలు జారీ చేశామని అంటోంది. ఇవి ఐఫోన్ యూజ్ చేసే వినియోగదారులకు మెయిల్ లేదా ఐమెసేజ్ ద్వారా పంపిస్తున్నామని తెలిపింది.

Also Read:Hyderabad: రెచ్చిపోయిన హైదరాబాదీలు..బిర్యానీ, హలీమ్ తెగ తిన్నారు

Advertisment
Advertisment
తాజా కథనాలు