Posani Krishna Murali: ఇక నుంచి వైఎస్సార్ రంగస్థల పురస్కారాలు: పోసాని కీలక ప్రకటన గతంలో ఎన్టీఆర్ రంగస్థల పురస్కారాలు ఇచ్చే వారని.. వాటితో పాటు ప్రస్తుతం వైఎస్సార్ రంగస్థల పురస్కారాలు ఇవ్వబోతున్నామని ఏపీ ఫిల్మ్ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి ప్రకటించారు. గతంలో ఈ అవార్డ్స్ కి 1.50లక్షలు ఇచ్చారన్నారు. ఇప్పుడు వైఎస్సార్ అవార్డ్స్ కు రూ.5 లక్షల నగదు బహుమతి ఇస్తామని తెలియజేశారు. By Archana 13 Oct 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Posani Krishna Murali: గతంలో ఎన్టీఆర్ రంగస్థల పురస్కారాలు ఇచ్చే వారని.. వాటితో పాటు ప్రస్తుతం వైఎస్సార్ రంగస్థల పురస్కారాలు ఇవ్వబోతున్నామని ఏపీ ఫిల్మ్ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి ప్రకటించారు. గతంలో ఈ అవార్డ్స్ కి 1.50లక్షలు ఇచ్చారన్నారు. ఇప్పుడు వైఎస్సార్ అవార్డ్స్ కు రూ.5 లక్షల నగదు బహుమతి ఇస్తామని తెలియజేశారు. నాటక రంగానికి రాజశేఖరరెడ్డి ఎంతో కృషి చేశారు. అందుకే ఆయన పేరు పెట్టామని తెలిపారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. నంది అవార్డుల బాధ్యతను చేపట్టిన తాను ఎటువంటి వివక్ష లేకుండా అర్హులకు మాత్రమే అవార్డులు అందేలా చర్యలు తీసుకుంటున్నానన్నారు. ఒకేసారి టీవీ, డ్రామా, సినిమా రంగాలకు అవార్డులు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. ముందు నాటికలతో మొదలు పెడతామని చెప్పారు. స్టేజ్ నంది అవార్డ్స్ కు సంబంధించి 130 ఎంట్రీలు వచ్చాయని తెలిపారు. అందులో ప్రదర్శనకు అనుకూలంగా ఉన్న 38 వాటిని సెలెక్ట్ చేశాము.నాటకాలు, నాటికలకు గుంటూరు వెంకటేశ్వర్ విజ్ఞాన మందిరంలో ప్రదర్శన ఉంటాయని వెల్లడించారు. సినిమా రంగంలో ఏ స్థాయిలో పని చేసే వారైనా.. ఏపీకి చెందిన వాళ్ళు అయితే వారికి ఐడీ కార్డ్స్ అందజేస్తామని తెలిపారు. దానికి సంబందించిన విధివిధానాలు ఇప్పటికే సిద్ధం అయినట్లు చెప్పారు. దీనికి సంబంధించి అక్టోబర్ 15 నుండి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అలాగే వారి డీటెయిల్స్ ఇస్తే... వాటిని స్క్రూటినీ చేసి ఐడీ కార్డ్స్ అందజేస్తామని తెలిపారు Also Read: Renu Desai : నాకు ఆ వ్యాధి ఉంది.. రేణు దేశాయ్ షాకింగ్ ప్రకటన..! #posani-krishna-murali #posani-apfdc-chairman #posani #posani-krishna-murali-hot-comments మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి