Sharmila: కనీసం పంట నష్ట పరిహారం కూడా ఇవ్వలేని దిక్కుమాలిన ప్రభుత్వం: షర్మిల! కనీసం పంట నష్ట పరిహారం కూడా ఇవ్వలేని దిక్కుమాలిన ప్రభుత్వం జగన్‌దని ఫైర్ అయ్యారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. రాష్ట్రంలో బాబుకి ఓటు వేసినా... జగన్‌కి ఓటు వేసినా.. పవన్‌కి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లేనని ఫైర్ అయ్యారు షర్మిల. ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యం తెలిపారు. By Trinath 07 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Sharmila Vs Jagan: తన అన్నయ్య జగన్‌పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మాటల దాడిని అంతకంతకూ పెంచుతున్నారు. బాపట్ల నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న షర్మిల సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారని.. ఆయన ఎప్పుడూ ప్రజల మధ్యకు రారని విమర్శించారు షర్మిల. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని సిద్ధం అంటూ బయటకు వచ్చారని ఎద్దెవా చేశారు. దేనికి సిద్ధం జగన్ సార్ అంటూ షర్మిల ప్రశ్నించారు. మళ్లీ 8 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా అని క్వశ్చన్ చేశారు. షర్మిల ఏం అన్నారంటే? ➼ బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా ? ➼ ప్రత్యేక హోదాను మళ్ళీ బీజేపీ దగ్గర తాకట్టు పెట్టడానికి సిద్ధమా ? ➼ పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేయడానికి సిద్ధమా ? ➼ 25 లక్షల ఇండ్లు కడతామని మోసం చేయడానికి సిద్ధమా ? ➼ రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ మాఫియాకు సిద్ధమా ? ➼ మీరు సిద్ధమైతే... ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధమా? ➼ ప్రత్యేక హోదా పై జగన్ చేతులు ఎత్తేశారు ➼ బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుందని, ఏమీ చేయలేమని అంటున్నారు ➼ రాజధాని లేదని, పోలవరం ఇవ్వలేదని.. ఎందుకు ఇన్నాళ్లు అడగలే..? ➼ నా గుండెలో నిజాయితీ ఉంది ➼ నా పుట్టింటికి మేలు చేయాలని తపన నాలో ఉంది ➼ అందుకే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్సార్ బిడ్డ అడుగు పెట్టింది. ➼ పోలవరం వచ్చేంత వరకు కొట్లాడుత. ➼ హోదా సాధించే వరకు కొట్లడుత. ➼ కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలో వస్తె హోదా రాదు. ➼ రాష్ట్రంలో బాబు కి ఓటు వేసినా... జగన్ కి ఓటు వేసినా.. పవన్ కి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లే! ➼ రాష్ట్రంలో ఒక్క సీటు గెలవక పోయినా బీజేపీ రాజ్యమేలుతుంది. ➼ హోదా రావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం. ➼ అధికారంలో వచ్చిన మొదటి రోజే హోదా పై సంతకం పెడతా అని రాహుల్ హామీ ఇచ్చారు. ➼ తలెత్తుకునేలా రాజధాని రావాలంటే కాంగ్రెస్ రావాలి. ➼ కనీసం రోడ్లు కూడా వేయలేదు. ➼ ఆరోజు గ్రామాలకు వేసిన రోడ్లు తప్పా కొత్తగా ఒక్క రోడ్డు కూడా వేయలేదు. ➼ తాగడానికి కనీసం త్రాగునీరు కూడా ఇవ్వలేని దుస్థితి. ➼ ఇక్కడున్న ఎమ్మెల్యే, ఎంపీలు ఇసుక మాఫియా మీద ప్రేమ తప్పా మరొకటి లేదు. ➼ ప్రజలను పట్టించుకొనే తీరిక లేదు. ➼ కెనాల్స్ కట్టలు కట్టే తీరిక లేదు కానీ... ఆ పక్కన ఇసుక దోచుకుంటున్నారు. ➼ వైఎస్సార్ గుర్తుతో గెలిచారు. గెలిచాక వైఎస్సార్ ఆశయాలను మరిచారు. ➼ కనీసం వైఎస్సార్ విగ్రహాన్ని కూడా పెట్టనివ్వడం లేదట. ఇదేనా వైఎస్సార్ పాలన? పంటనష్టం కూడా ఇవ్వడంలేదు: వైఎస్సార్ హయాంలో రైతే రాజు అని.. సబ్సిడీ పథకాలతో రైతును ఆదుకున్నారని తన తండ్రి గురించి చెప్పుకొచ్చారు షర్మిల. పంట నష్టపోతే రెండింతలు పరిహారం ఇచ్చేవారని గుర్తు చేశారు. ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం.. కనీసం పంట నష్ట పరిహారం కూడా ఇవ్వలేని దిక్కుమాలిన ప్రభుత్వమని ఫైర్ అయ్యారు. రైతుకు పరిహారం లేదు.. కనీసం భీమా కూడా లేదని మండిపడ్డారు. అంతా మోసమే.. అన్ని వర్గాలకు మోసమేనని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి నిరుద్యోగులను మోసం చేసింది వైసీపీనేనని మండిపడ్డారు. గ్రూప్ 1 ఉద్యోగాలను భర్తీ చేయాలేని అసమర్థ ప్రభుత్వం ఇదేనని విరుచుకుపడ్డారు. Also Read: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ది కేరళ స్టోరీ’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే #ys-jagan #ap-elections-2024 #ys-sharmila #ap-politics-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి