AP : పవన్ కళ్యాణ్‌తో భేటీ.. స్పెషల్ ఫ్లైట్ లో బయలుదేరిన ప్రముఖ నిర్మాతలు..!

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో నేడు ప్రముఖ నిర్మాతలు భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు క్యాంప్ ఆఫీసులో జరిగే భేటీ కోసం నిర్మాతలు స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడకు బయలుదేరారు. ఏపీలో సినిమా టికెట్స్ రేట్లు, సినిమా నిర్మాతల సమస్యలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది.

New Update
AP : పవన్ కళ్యాణ్‌తో భేటీ.. స్పెషల్ ఫ్లైట్ లో బయలుదేరిన ప్రముఖ నిర్మాతలు..!

AP Tollywood Producers Will Meet Pawan Kalyan : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌, సినిమాటోగ్రఫీ (Cinematography) శాఖ మంత్రి కందులు దుర్గేష్ తో నేడు ప్రముఖ నిర్మాతలు భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు క్యాంప్ ఆఫీసులో జరిగే భేటీ కోసం నిర్మాతలు స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడ (Vijayawada) కు బయలుదేరారు. ఏపీలో సినిమా నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, టికెట్ల రేట్లు వ్యవహారం, టికెట్ల రేట్స్ స్లాబులకు సంబంధించిన అంశంపై గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలపై పునః సమీక్ష వేయాలని నిర్మాతలు కోరనున్నారు.

చలసాని అశ్వినీ దత్, అల్లు అరవింద్, ఎర్నేని నవీన్, దగ్గుబాటి సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్, సుప్రియ యార్లగడ్డ, కనుమూరి రఘురామకృష్ణంరాజు (ఉండి ఎమ్మెల్యే) స్పెషల్ ఫ్లైట్ లో బయలుదేరగా.. మిగిలిన నిర్మాతలు రోడ్డు మార్గం ద్వారా విజయవాడకి ప్రయాణం అయ్యారు. కాగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక టాలీవుడ్ (Tollywood) ప్రముఖ నిర్మాతలు తొలిసారి భేటి కానున్నారు.

Also Read: ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం.. ఈ అంశాలపై చంద్రబాబు సర్కార్ స్పెషల్ ఫోకస్..!

పెద్ద బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ రేట్స్ పెంచుకునే వెసులుబాటు కల్పించాలని నిర్మాతలు ప్రభుత్వాన్ని కోరినున్నారు.  గత ప్రభుత్వ హయాంలో టికెట్ల రేట్ల స్లాబ్ కు సంబంధించి జీవో నెంబర్ 35 తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం..మండలాల్లో, మున్సిపాలిటీల్లో, మున్సిపల్ కార్పొరేషన్, మెట్రో నాగరాల్లో టికెట్ల ధరలు జీవో ఆధారంగా నిర్ణయించింది. మండలాల్లో అత్యల్పంగా నేల టికెట్ ఆరు రూపాయలు, మెట్రో నగరాలలో మల్టీప్లెక్స్ ధర వంద రూపాయలు గరిష్టంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం గత జీవోలు పేర్కొంది.

అంతేకాకుండా ఆన్లైన్ టికెట్లన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధారిటీ ఆధ్వర్యంలోనే విక్రయించాలని జీవో నెంబర్ 69 తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ జీవో కారణంగా థియేటర్ యాజమాన్యాల నష్టపోతాయని అప్పట్లో థియేటర్ యజమానులు పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటిమీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందులు దుర్గేష్ వద్ద నిర్మాతలు ప్రస్తావించనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు