Chandrababu: జైల్లో చంద్రబాబుకు మరో ఆరోగ్య సమస్య.. టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ టెన్షన్..!

రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న చంద్రబాబుకు మరో ఆరోగ్య సమస్య వచ్చింది. జైలులో స్కిన్ అలర్జీతో చంద్రబాబు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. జైలు అధికారులకు టీడీపీ అధినేత ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దీంతో స్కిన్‌ అలర్జీ డాక్టర్‌ జైలుకు చేరుకున్నారు. 33 రోజులుగా చంద్రబాబు జైలులోనే ఉన్నారు. ఏపీ స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్‌ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

New Update
Chandrababu: జైల్లో చంద్రబాబుకు మరో ఆరోగ్య సమస్య.. టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ టెన్షన్..!

రాజమండ్రి(Rajahmundry) సెంట్రల్‌ జైలు(Central jail)లో ఉన్న చంద్రబాబు(Chandrababu)కు మరో ఆరోగ్య సమస్య వచ్చింది. జైలులో స్కిన్ అలర్జీతో చంద్రబాబు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. జైలు అధికారులకు టీడీపీ అధినేత ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దీంతో స్కిన్‌ అలర్జీ డాక్టర్‌ జైలుకు చేరుకున్నారు. 33 రోజులుగా చంద్రబాబు జైలులోనే ఉన్నారు. ఏపీ స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్‌ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.


డీహైడ్రెషన్‌ తర్వాత స్కిన్‌ ప్రాబ్లెమ్‌:
ఇక రెండు రోజుల క్రితం కూడా చంద్రబాబునాయుడు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వేడి, తేమ కారణంగా డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నట్లు జైలు అధికారులకు తెలిపారు. మంగళవారం చంద్రబాబును కలిసిన ఆయన కుటుంబ సభ్యులకు అనారోగ్యం గురించి తెలియజేశారు. సెంట్రల్ జైలు అధికారులు ఆయనకు చికిత్స అందించారు. ఇక ముగ్గురు వైద్యులు అతని ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు.
publive-image
చంద్రబాబుకు షాక్‌ల మీద షాకులు:
మరోవైపు ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు షాక్ తగిలింది. పీటీ వారెంట్‌పై ఆయనను విచారించేందుకు ఏసీబీ కోర్టు (ACB Court) అనుమతిచ్చింది. సోమవారం చంద్రబాబును హాజరుపర్చాలని ఆదేశాలు జారీ చేసింది. ఆరోజు ఉదయం 10 గంటల నుంచి సాయత్రం 5 గంటలలోపు చంద్రబాబును కోర్టులో హాజరుపరచాలని జడ్జి ఆదేశించారు. ఇదిలా ఉంటే చంద్రబాబదు న్యాయవాదులు దాఖలు చేసిన కాల్ డేటా పిటిషన్ ను విచారణకు స్వీకరించింది ఏసీబీ కోర్టు. ఈ పిటిషన్ ను రేపటికి వాయిదా వేయాలని సీఐడీ తరఫు న్యాయవాదులు కోరగా అందుకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఒప్పుకోలేదు. దీంతో ఏసీబీ కోర్టులో ఆ పిటిషన్ పై వాదనలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రేపు ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం చంద్రబాబు జ్యూడిషియల్ రిమాండ్ ఈ నెల 19వ తేదీ వరకు ఉంది. ఇక ఇదే సమయంలో ఆయన్ను వరుస పెట్టి ఆరోగ్య సమస్యలు వస్తుండడంతో టీడీపీ శ్రేణులను కలవర పెడుతోంది. చంద్రబాబు క్షేమంగా ఉండాలని టీడీపీ కార్యకర్తలు పూజలు చేస్తున్నారు.

ALSO READ: అక్కడి నుంచి పోటీ చేస్తా.. బ్రదర్ అనిల్, విజయమ్మ కూడా.. షర్మిల సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
తాజా కథనాలు