Chandrababu case: చంద్రబాబు రిమాండ్ పొడిగింపు?? కొద్ది గంటల్లో ఏం జరగబోతోంది? ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్‌పై వాదనలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇక రేపటితో చంద్రబాబు రిమాండ్ ముగియనుండగా.. నెక్ట్స్ ఏం జరగబోతోందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక చంద్రబాబును అధికారులు వర్చువల్‌గా ప్రవేశపెట్టనున్నారు. By Trinath 04 Oct 2023 in గుంటూరు టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్‌పై వాదనలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇక రేపటితో చంద్రబాబు రిమాండ్ ముగియనుండగా.. నెక్ట్స్ ఏం జరగబోతోందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక చంద్రబాబును అధికారులు వర్చువల్‌గా ప్రవేశపెట్టనున్నారు. CLICK HERE TO VIEW RTV WHATSAPP CHANNEL: మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కావాలా? ఆర్టీవీ వాట్సాప్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేసి వార్తలను చూడండి నిన్న సుప్రీంకోర్టులో ఏం జరిగిందంటే? రూ.371 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ని కొట్టివేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌కు మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. గత విడత విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టులో సమర్పించిన కేసుకు సంబంధించిన పూర్తి పత్రాలను సమర్పించాలని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ) ప్రకారం అనుమతి తీసుకోకుండానే అన్ని చర్యలు తీసుకున్నారన్న వాస్తవాన్ని విస్మరించి తనను అక్రమంగా అరెస్టు చేశారని, తన స్వేచ్ఛకు భంగం కలిగించారని టీడీపీ అధినేత తన స్పెషల్ లీవ్ పిటిషన్ లో వాదించారు. సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వీ, సిద్ధార్థ్ లూథ్రాలతో కూడిన చంద్రబాబు న్యాయ బృందం ఎఫ్ఐఆర్‌లోని ఆరోపణలన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు, సూచనలు లేదా సిఫార్సులకు సంబంధించినవని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇది రాజకీయ కేసు మాత్రమేనని, ఈ విషయంలో సెక్షన్ 17(ఏ) నిబంధనలు వర్తిస్తాయని సాల్వే స్పష్టం చేశారు. ఎఫ్ఐఆర్ తర్వాత సీఐడీ చంద్రబాబును ఎఫ్ఐఆర్‌లో చేర్చిందని లూథ్రా పేర్కొన్నారు. రేపటితో రిమాండ్ పూర్తి? ఇక చంద్రబాబు నాయుడి జ్యుడీషియల్ రిమాండ్ ను అక్టోబర్ 5 వరకు ఎసిబి కోర్టు గతంలో పొడిగించింది. గత ఆదివారం సాయంత్రం పోలీసు కస్టడీ ముగియడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబును ఏసీబీ కోర్టు మెజిస్ట్రేట్ ముందు సీఐడీ అధికారులు హాజరుపరిచారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో సెప్టెంబర్ 9న చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసింది. తొలుత సెప్టెంబర్ 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. సీఐడీ అధికారులు ఇబ్బంది పడుతున్నారా అని ఏసీబీ కోర్టు జడ్జి బి.హిమ బిందు చంద్రబాబును ప్రశ్నించారు. విచారణకు తాను సహకరించానని, సంబంధిత ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చానని చంద్రబాబు మేజిస్ట్రేట్ కు తెలిపారు. ఏ తప్పూ చేయకుండా తనను జైల్లో పెట్టారని చంద్రబాబు నాయుడు మరోసారి మేజిస్ట్రేట్ కు తెలిపారు. కోర్టు విధివిధానాలు పాటించాలని, ప్రస్తుతానికి ఇది కేవలం ఆరోపణ మాత్రమేనని, జ్యుడీషియల్ కస్టడీ అంటే శిక్ష కాదని మేజిస్ట్రేట్ చంద్రబాబుకు చెప్పారు. ఇక బెయిల్‌తో పాటు కస్టడి పిటిషన్‌ను విచారించిన కోర్టు రేపటికి(అక్టోబర్ 5)కి విచారణను వాయిదా వేసింది. ALSO READ: తెలంగాణపై కేంద్రం వరాల జల్లు.. ఎట్టకేలకు కృష్ణా జలాలపై స్పందన.. #chandrababu-arrest మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి