AP Pensions Hike : ఏపీలో నేటి నుంచే పెరిగిన పెన్షన్ల పంపిణీ.. ఎవరికి ఎంతంటే? ఏపీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లను రెడీ చేశారు. జులై 1 న ఉదయం 6 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65.31 లక్షల మందికి పెన్షన్లను అందజేయనున్నారు. ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొనబోతున్నారు. By Bhavana 01 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి AP Pensions : ఏపీలో సార్వత్రిక ఎన్నికల (General Elections) సమయంలో కూటమి ప్రభుత్వం (Alliance Government) అధికారంలోకి రాగానే పెన్షన్లను పెంచుతామని హామీ ఇవ్వడం...ఆ హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన విషయం గురించి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లను రెడీ చేశారు. జులై 1 న ఉదయం 6 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65.31 లక్షల మందికి పెన్షన్లను (Pensions) అందజేయనున్నారు. ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) స్వయంగా పాల్గొనబోతున్నారు. ఆయనే స్వయంగా కొందరు లబ్దిదారులకు పెంచిన కొత్త పెన్షన్ ను అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనేందుకు బాబు ఆయన ఉండవల్లి నివాసం నుంచి జులై 1 ఉదయం 05.45 గంటలకు బయలుదేరి 06.00 గంటలకు పెనుమాక గ్రామానికి చేరుకుంటారు. అక్కడ 06.20 గంటల వరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, ఎస్టీ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు బాబే స్వయంగా వెళ్లి నేరుగా పింఛన్లు అందజేస్తారు. అనంతరం 07.15 వరకు పెనుమాకలోని మసీదు సెంటర్ లో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులు, ప్రజలతో ఆయన ముచ్చటిస్తారు. అనంతరం సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని నివాసానికి తిరిగి బయల్దేరతారు. పెరిగిన పింఛన్లు ..ఎవరెవరికి ఎంతంతంటే... ఏపీలో మొత్తం 28 విభాగాలకు చెందిన లబ్దిదారులకు జులై 1 నుంచి పెరిగిన పెన్షన్ ను అందజేయనున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా సవరించిన పింఛన్లను ఎన్నికల సమయంలోని మూడు నెలలకు కూడా వర్తింపచేశారు. - పెరిగిన పింఛనుతో ఏప్రిల్ 1 నుంచి రూ.4000 లబ్ధి, ఏప్రిల్, మే, జూన్ నెలలకు రూ.3000 కలిపి మొత్తం రూ.7000 ను అందజేయనున్నారు . - వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మత్స్య కారులు, కళా కారులు, డప్పు కళాకారులు, చేనేత, కల్లుగీత కార్మికులు, ట్రాన్స్ జెండర్స్ వంటి వారికి జులై నుంచి రూ.4000 పింఛను ను ప్రభుత్వం అందజేస్తుంది. - దివ్యాంగులకు పింఛన్ రూ.3000 పెంచారు. కూటమి ప్రభుత్వం వారికి రూ.6000 పెన్షన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. - తీవ్ర అనారోగ్యంతో దీర్ఘ కాలిక వ్యాధులు ఉండే వారికి ఇచ్చే పెన్షన్ ను రూ.5000 నుంచి రూ.15000 లకి కూటమి ప్రభుత్వం పెంచింది. మొత్తం 24318 మంది ఈ విభాగంలో పింఛను అందనుంది. రాష్ట్రంలో పింఛన్ల పెంపు వల్ల కూటమి ప్రభుత్వంపై నెలకు రూ.819 కోట్ల అదనపు భారం పడనుంది. పింఛనుదారులకు లబ్ధి చేకూర్చేందుకు కూటమి ప్రభుత్వం రూ.4,408 కోట్లను జులై 1 ఒక్కరోజున పంపిణీ చేయనుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు సైతం పెంచిన పింఛన్ ఇవ్వడం వల్ల ఏపీ ప్రభుత్వంపై రూ.1650 కోట్లు అదనపు భారం పడనుంది. గత ప్రభుత్వం పింఛను కోసం కేవలం నెలకు రూ.1939 కోట్లు ఖర్చు చేసింది. ఏపీలో సచివాలయ ఉద్యోగులు దాదాపు 1,20,097 మందితో పింఛను పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు బాబు ప్రభుత్వం ఇది వరకే ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వం ఏడాదికి ఇకపై రూ.34 వేల కోట్లు కేవలం పెన్షన్లను అందించడం కోసమే ఖర్చు చేయనుందని అధికారులు సమాచారం. Also read: జులై 1 నుంచి అమల్లోకి కొత్త నేర చట్టాలు.. పూర్తి వివరాలు #ap-cm-chandrababu #tdp #elections #new-pension మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి