చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారు: మంత్రి కాకాని!

వైసీపీ మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద తీవ్ర విమర్శలు చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేశారు.

New Update
Kakani: చర్యలు తీసుకోవాలి.. లేదంటే చేసేది ఇదే.. మంత్రి కాకాణి హాట్ కామెంట్స్..!

వైసీపీ మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద తీవ్ర విమర్శలు చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేశారు.

ప్రాజెక్టుల సందర్శన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న ఆయనకు ఎక్కడ ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో అన్న సంగతి కూడా తెలియదు. అలాంటి వ్యక్తి వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. జగనన్న కి చెబుదాం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

అక్కడ మంత్రి కాకాని మాట్లాడుతూ..11 రకాల సర్టిఫికేట్లను ప్రజలకు అందిస్తున్నామని వెల్లడించారు. చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకు ప్రజలు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. అందుకే ఆయనకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి పోలీసులకు వర్క్‌ ఫ్రం హోం ఇస్తానని చెబుతున్నాడు. అంటే ఆయనకు మతి ఉంది అనుకోవాలా? లేదు అనుకోవాలా ? అంటూ ప్రశ్నించారు. ఈ మాటలు బట్టే ఆయన మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అంటూ హేళన చేశారు.

నెల్లూరు, సంగం బ్యారేజీల పనులు పూర్తి చేసి ప్రారంభించినట్లు మంత్రి కాకాని తెలిపారు. సోమశిల నుంచి కండలేరు జలాశయానికి వరద నీటిని పంపే కాలువ సామర్థ్యాన్ని కూడా పెంచిన ఘనత వైసీపీదేనని ఆయన పేర్కొన్నారు మంత్రి కాకాని.

ఈ విషయం గురించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు సీనియర్‌ నేత విజయసాయిరెడ్డి కూడా ట్విట్టర్లో సెటైర్లు వేశారు. ఏది ట్రెండింగులో ఉంటే దాన్ని ఫాలో కావడం చంద్రబాబు గారి బలహీనత. కొవిడ్‌ తర్వాత వర్క్ ఫ్రం హోమ్ అమలులోకి వచ్చింది. పోలీసులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఎలా సాధ్యం? మొన్న 50 మంది పోలీసులను రక్తాలు కారేలా కొట్టించాడు.అసాధ్యమని తెలిసి కూడా వారిని బుజ్జగించేందుకు ఇప్పుడీ అనాలోచిత హామీ గుప్పించాడు” అని పోస్ట్ పెట్టడం జరిగింది.

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం పై యుద్ధభేరి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పుంగనూరులో పర్యటన చేపడుతూ ఉండగా టీడీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

ఈ ఘర్షణలో దాదాపు 40 మందికి పైగా పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.దీంతో 62 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కేసు కూడా పెట్టడం జరిగింది. ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు