Kadapa: కడపలో రసవత్తరపోరు.. ఎంపీ విజేత ఎవరో చెప్పేసిన ఆర్టీవీ!

కడప ఎంపీ సీటు కోసం రసవత్తర పోరు జరుగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల ఇక్కడ బరిలో ఉండటంతో టీడీపీ అభ్యర్ధిగా ఉన్న భూపేష్‌రెడ్డి గెలుపుకోసం చాలా కష్టపడుతున్నారు. అయితే ఇక్కడ ఎవరూ విజయం సాధిస్తారో చెప్పేసిన ఆర్టీవీ స్టడీ కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Kadapa: కడపలో రసవత్తరపోరు.. ఎంపీ విజేత ఎవరో చెప్పేసిన ఆర్టీవీ!

Kadapa: ఏపీ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా కడప ఎంపీ సీటు కోసం రసవత్తర పోరు జరుగుతుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల ఇక్కడ బరిలో ఉండటంతో అందరి దృష్టి ఈ సీటుపై ఉంది. వైసీపీ అభ్యర్ధి, సిట్టింగ్ ఎంపీ అవినాష్‌రెడ్డికి వివేకా హత్యకేసు వివాదం మైనస్‌గా ఉంది.

publive-image

గత ఎన్నికల్లో అవినాష్‌రెడ్డి కోసం ప్రచారం చేసిన షర్మిల, ఈసారి ప్రత్యర్ధిగా బరిలో ఉండటం ఆయనకి ఇబ్బందికరంగా మారింది. వివేకా కూతురు డాక్టర్ సునీత కూడా ప్రచారం చేయడంతో సానుభూతి ఓట్లు షర్మిలకు పడే ఛాన్సుంది. అవినాష్‌రెడ్డి కోసం వైఎస్ భారతి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయడం ప్లస్ అవుతుంది. టీడీపీ అభ్యర్ధిగా ఉన్న భూపేష్‌రెడ్డి రాజకీయాలకు కొత్త కావడం మైనస్‌గా ఉంది.

publive-image

జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ ఆశించిన భూపేష్‌రెడ్డి అయిష్టంగానే కడప బరిలోకి దిగారన్న టాక్ ఉంది. కడప లోక్‌సభ పరిధిలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుందని ఆర్టీవీ స్టడీలో ఇప్పటికే వెల్లడించాం. అంతిమంగా వైసీపీ అభ్యర్ధి అవినాష్‌రెడ్డి కడపలో మరోసారి గెలుస్తారని ఆర్టీవీ స్టడీలో తేలింది.

publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు