Chandrababu : చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై హైకోర్టు నుంచి కీలక అప్‎డేట్..!!

టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది న్యాయస్థానం.

New Update
AP Politics : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

Chandrababu Bail Petition: టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి మధ్యంతర బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి. మధ్యంతర బెయిల్ పిటిషన్లపై మంగళవారానికి తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు (High Court). విచారణ ప్రారంభం కాగానే బెయిల్ పిటిషన్ పై చంద్రబాబు తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. చంద్రబాబు తరపున న్యాయవాదుల వాదనలపై సిఐడి తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. మధ్యంతర, అనుబంధ పిటిషన్లు దాఖలు చేసి వాటిపై వాదనలు వినిపించకుండా బెయిల్ పిటిషన్ పై ఎలా వాదనలు వినిపిస్తారంటూ అభ్యంతరం తెలిపారు సిఐడి (CID) తరపున న్యాయవాదులు. దీంతో మధ్యంతర బెయిల్ (Chandrababu Bail) పిటిషన్ పై ఇరుపక్షాల న్యాయవాదలు తమ వాదనలను వినిపించారు.

ఇది కూడా చదవండి:  కొత్త ప్రభాకర్ రెడ్డిని పొడిచింది ఇతడే.. ఫొటో రిలీజ్ చేసిన బీఆర్ఎస్!

చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై లుత్రా (Sidharth Luthra) వాదనలు వినిపించారు. చంద్రబాబు 50 రోజులకు పైగా జైలులో ఉన్నారని...ఆయన అరెస్ట్ జరిగిన తర్వాత కొత్తగా ఆరోపణలు రాలేదన్నారు. ఈ కేసులో సీఐడీ విచారణలో పురోగతి ఏమీ లేదని కోర్టుకు వివరించారు. చంద్రబాబుకి బెయిల్ ఇవ్వాలని కోరారు. దీంతో సిఐడి తరపు న్యాయవాదులు కూడా తమ వాదనలను వినిపించారు. జైల్లో చంద్రబాబుకు కావలసిన వైద్య పరీక్షలన్నీ నిర్వహిస్తున్నామని..చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. ఆయనకు అవసరమైన మెడిసిన్స్ అన్నీ అందిస్తున్నామని కోర్టుకు తెలిపారు. ఆయనకు వచ్చినవి చిన్న చిన్న ఇబ్బందులే అన్నారు. ఆయన టెస్టులకు సహకరించటం లేదని.. ఆయన భార్యకు ఇప్పటికే రెండు సార్లు తెలియజేశామని..ఆమె కూడా స్పందించలేదని సిఐడి తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కంటి ఆపరేషన్ సంబంధించిన విషయాన్నీ కూడా కోర్టుకు తెలిపారు.

ఇది కూడా చదవండి: జంప్ జిలానీలు పాసింగ్ క్లౌడ్స్ లాంటివారు-కే.లక్ష్మణ్

కాగా విచారణకు పూర్తిగా చంద్రబాబు సహకరిస్తారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టు స్పష్టం చేసినట్లుగా సమాచారం. అటు సుప్రీంలో క్వాష్ తీర్పుపై ఆసక్తి నెలకొంది. వచ్చే నెల 8,9 తేదీల్లో సుప్రీంకోర్టులో చంద్రబాబుకు సంబంధించిన కీలక తీర్పులు వెలువడే ఛాన్స్ ఉంది. దీంతో మంగళారం హైకోర్టు బెయిల్ పైన తీర్పు విషయలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు