School Holidays: : భారీ వర్షాలు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు!

వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలు, అనకాపల్లి,కాకినాడ, ఏలూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ జిల్లా,బాపట్ల జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

author-image
By Bhavana
New Update
Heavy Rains: ఏలూరు, అల్లూరి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌!

School Holidays : ఆంధ్రప్రదేశ్‌ లో వాయుగుండం ప్రభావం అధికంగా ఉండడంతో విశాఖ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవగా జలాశయాలన్నినిండుకుండలా మారాయి. ఏజెన్సీలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అప్రమత్తంగా ఉండాలని, వాగులు దాటే ప్రయత్నం చేయోద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు విశాఖలో కుండపోత వర్షానికి గవర కంచరపాలెం, ఆనందపురం ప్రాంతాల్లో ప్రహరీ గోడలు కూలిపోవడం వల్ల కొన్ని వాహనాలు తీవ్రంగా ధ్వంసం అయ్యాయి. మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాతో పాటు.. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలు, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు బాపట్ల జిల్లాలోని కొన్ని మండలాల్లో ఈ రోజు కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

Also Read: బుడమేరుకు ఏ క్షణమైనా వరద!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

చనిపోయిన పందిని మళ్లీ బతికించారు ..!

చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్లి బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు.

author-image
By Archana
New Update

Life Style: ఇదొక మెడికల్ మిరాకిల్ అనే పదం వినే ఉంటారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే చైనాలో చోటుచేసుకుంది. చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్ళీ బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు. సాధారణంగా గుండె ఆగిపోయినప్పుడు.. మెదడు రక్తప్రసరణ కూడా ఆగిపోతుంది. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే మెదడు కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. ఈ పరిస్థితి ఇస్కీమియాకు దారితీస్తుంది. ఇస్కీమియా అనేది శరీరంలో కొంత భాగానికి రక్త ప్రవాహం తక్కువగా ఉండడం. సరైన రక్త ప్రవాహం లేకపోవడం వల్ల కణజాలాలకు అవసరమైన ఆక్సిజన్‌ అందదు. ఇలాంటి పరిస్థితిల్లో మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయి శాశ్వతంగా మెదడు క్షీణించటం మొదలవుతుంది. అంతేకాదు  గుండెపోటు గుండెపోటు, స్ట్రోక్స్ వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తుంది.

Also Read: 'ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్'! మెగాస్టార్ ట్వీట్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే

చైనా శాస్త్రవేత్తలు అద్భుతం 

ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు చనిపోయిన పంది మెదడును బతికించిన ఫలితాలు .. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయిన నిమిషాల వ్యవధిలోనే మెదడు శాశ్వతంగా క్షీణించటం మొదలవుతుందనే భావనను సవాలు చేసేలా ఉన్నాయి. అయితే పందులు చనిపోయిన తర్వాత నాలుగు గంటల అనంతరం వాటి మెదళ్లను పాక్షికంగా పునరుద్ధరించిన ఘటన 2019లోనూ జరిగింది. 

బ్రెయిన్ డెడ్ అంటే ఏమిటి? 

మెదడుకు రక్తం లేదా ఆక్సిజన్ సరఫరా ఆగిపోయినప్పుడు బ్రెయిన్ డెత్ సంభవిస్తుంది.

బ్రెయిన్ డెడ్ కారణాలు

  • మెదడుకు తీవ్రమైన గాయమైనప్పుడు
  • మెదడులో రక్తస్రావం జరగడం (ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్) 
  • ఇస్కీమిక్ స్ట్రోక్ ( సరైన ఆక్సిజన్ అందకపోవడం) 
  • గుండెపోటు
  • మెనింజైటిస్ లేదా ఎన్సెఫాలిటిస్ వంటి ఇంట్రాక్రానియల్ ఇన్ఫెక్షన్లు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: గంగవ్వకు బిగ్ బాస్ షాక్! పాపం అవ్వ.. ఇలా జరిగిందేంటి

Advertisment
Advertisment
Advertisment