YCP Office Demolish: వైసీపీ ఆఫీసు కూల్చింది అందుకే.. చంద్రబాబు సర్కార్ సంచలన ప్రకటన! గత నెలలోనే వైసీపీ అక్రమంగా చేపట్టిన ఆఫీసు నిర్మాణంపై అధికారులు నోటీసులు ఇచ్చారని ప్రభుత్వం తెలిపింది. ఆ నోటీసును పట్టించుకోకపోవడంతో ఈ నెల 10న మరోసారి నోటీసులు ఇచ్చారని వెల్లడించింది. అయినా.. స్పందన లేకపోవడంతో కూల్చివేతకు ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేసింది. By Nikhil 22 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Tadepalli YCP Party Office Demolish: తాడేపల్లి వైసీపీ ఆఫీసు కూల్చివేత అంశంపై ప్రభుత్వం స్పందించింది. వైసీపీ అక్రమ నిర్మాణంపై వివరణ ఇవ్వాలంటూ గత నెలలోనే మున్సిపల్ అధికారులు నోటీసులు (Notices) ఇచ్చినట్లు తెలిపింది. పలుమార్లు నోటీసులిచ్చినా వైసీపీ లెక్కచేయలేదని అధికారులు తెలిపారు. వైసీపీ జిల్లా ఆఫీసుకు గతనెల 5న మొదటిసారి నోటీసులు అందినట్లు చెబుతున్నారు ప్రభుత్వం. మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు పంపించారు. మున్సిపల్ అధికారుల నోటీసులను వైసీపీ పట్టించుకోకపోవడంతో ఈనెల 10న రెండోసారి నోటీసులను పంపించారు. ఈ అక్రమ నిర్మాణంపై 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది వైసీపీ. అధికారులు ఇచ్చిన గడువు ఈనెల 17తో పూర్తియినా వైసీపీ నుంచి స్పందన లేకపోవడంతో 20న కూల్చివేతకు ఆదేశాలు జారీ చేశామని ప్రభుత్వం చెబుతోంది. మున్సిపల్ అధికారుల ఆదేశాలతో ఈ రోజు వైసీపీ ఆఫీసును కూల్చివేశారు. Also Read: జగన్ కు షాక్.. ఆ ముగ్గురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు జంప్..! #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి