AP News : మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం.. సంచలన ఆదేశాలు జారీ! జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని కార్యాలయ సిబ్బందికి ఏపీ సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. సచివాలయంలో తమ అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు, వస్తువులు బయటకు తీసుకెళ్లొద్దని స్పష్టం చేసింది. By Nikhil 30 May 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి General Administration Department Issue : జూన్ 4న ఏపీ (AP) లో ఎన్నికల ఫలితాలు (Election Results) వెల్లడికానున్న వేళ సాధారణ పరిపాలన శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని కార్యాలయ సిబ్బందికి సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. సచివాలయం (Sachivalayam) లో తమ అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు, వస్తువులు బయటకు తీసుకెళ్లొద్దంటూ ఆదేశాల్లో పేర్కొంది. ప్రత్యేకించి మంత్రుల పేషీలు, ప్రభుత్వశాఖల్లోని దస్త్రాలు, కాగితాలను తరలించేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. వాహన తనిఖీలు నిర్వహించాల్సిందిగా సచివాలయం భద్రత చూసే ఎస్పీఎఫ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది సాధారణ పరిపాలక శాఖ. జూన్ 3 తేదీన మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని.. ఆ లోగా వాటిని ఖాళీ చేయాలని స్పష్టం చేసింది. Also Read : అష్టదిగ్బంధంలో కడప.. వారిపై అధికారుల డేగ కన్ను.. #ys-jagan #ap-government #ap-election-results #sachivalayam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి