AP High Court: మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట

మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. రాజధాని అమరావతి అసైన్ భూముల కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ ను మరో రెండు వారాలు పొడిగించింది ఏపీ హైకోర్టు. నారాయణ దాఖలు చేసిన మరో నాలుగు బెయిల్ పిటిషన్లను హైకోర్టు వాయిదా వేసింది. ఆ పిటిషన్ల విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిల్, క్వాష్ పిటిషన్ వాయిదా పడ్డాయి. అసైన్ ల్యాండ్స్ కేసులో క్వాష్, బెయిల్ పిటిషన్లను సైతం వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.

New Update
AP High Court: మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట

మాజీ మంత్రి నారాయణకు (AP Ex Minister Narayana) ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. రాజధాని అమరావతి అసైన్ భూముల కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ ను పొడిగించింది ఏపీ హైకోర్టు (AP High Court). మాజీ మంత్రి నారాయణతో పాటుగా మరి కొంత మంది భూములను కొనుగోలు చేసిన వారికి సంబంధించి కూడా బెయిల్ ఈ రోజుతో ముగిసింది. ఈ సందర్భంగా తమకు మరికొత సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. ఈ నేపథ్యంలో కేసు విచారణను మరో రెండు వారాలకు వాయిదా వేసింది ధర్మాసనం.  అయితే మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన మరో నాలుగు బెయిల్ పిటిషన్లను హైకోర్టు వాయిదా వేసింది. ఆ పిటిషన్ల విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో (AP Inner Ring Road Case) బెయిల్, క్వాష్ పిటిషన్ వాయిదా పడ్డాయి. అసైన్ ల్యాండ్స్ కేసులో క్వాష్, బెయిల్ పిటిషన్లను సైతం వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
ఇది కూడా చదవండి: Chandrababu Updates: చంద్రబాబుతో ములాఖత్.. బాబు ఆరోగ్యంపై చినరాజప్ప కీలక ప్రకటన..

ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత నారాయణకు ఏపీ సీఐడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో (AP CID Inner Ring Road Case) ఈ నెల 4న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది సీఐడీ. వాట్సాప్ ద్వారా ఈ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. ఇంకా మెయిల్ ద్వారా కూడా ఆయనకు నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో నారాయణ ఏ2గా ఉన్నారు.
ఇది కూడా చదవండి: Atma Sakshi Survey: ఏపీలో టీడీపీదే విజయం.. ఆత్మసాక్షి సర్వే చెప్పిన లెక్కలు ఇవే..!!

అయితే.. నారాయణకు విచారణకు రమ్మన్న రోజే నారా లోకేష్ (Nara Lokesh) కూడా విచారణకు హాజరుకానున్నారు. దీంతో ఇద్దరినీ ఆ రోజే అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. గత శనివారం నారా లోకేష్ కు ఏపీ సీఐడీ అధికారులు ఢిల్లీలో కలిసి నోటీసులు అందజేశారు. ఈ నెల 4న విచారణకు రావాలని తెలిపారు. దీనికి స్పందించిన లోకేష్ విచారణకు వస్తానని సీఐడీ అధికారులతో తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు