BIG BREAKING: ఏపీ హైకోర్టులో జగన్ పిటిషన్ వైసీపీ అధినేత జగన్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తనకు ఉన్న భద్రతను తిరిగి కొనసాగించాలని కోరారు. తనకు కేటాయించిన వాహనం మరమ్మతులకు గురవుతోందని పిటిషన్ లో పేర్కొన్నారు. తన భద్రతకు ముప్పు ఉందని కోర్టుకు తెలిపారు. By Nikhil 05 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి వైసీపీ అధినేత జగన్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తనకు ఉన్న భద్రతను తిరిగి కొనసాగించాలని కోరారు. తనకు కేటాయించిన వాహనం మరమ్మతులకు గురవుతోందని పిటిషన్ లో పేర్కొన్నారు. తన భద్రతకు ముప్పు ఉందని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ఏకపక్షంగా తన సెక్యూరిటీని తొలగించిందని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. తనకు ఉన్న ప్రాణహాని ఉందని.. ఈ విషయాన్ని పరిశీలించకుండా ప్రభుత్వం సెక్యూరిటీ తీసేసిందని ఆయన కోర్టుకు తెలిపినట్లు సమాచారం. దీంతో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇది కూడా చదవండి: Jagan-Chandrababu: జగన్ కు చంద్రబాబు మరో బిగ్ షాక్.. ఆ శాఖలో అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశం! ఇదిలా ఉంటే.. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని కోరుతూ సైతం జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా స్పీకర్ ను ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. ప్రతిపక్ష నేత హోదా కోసం తాను గతంలో స్పీకర్ కు లేఖ రాశానని కోర్టుకు తెలిపారు. అయినా.. తనకు ప్రతిపక్షనేత హోదా ఇవ్వలేదని పేర్కొన్నారు. జగన్ తన పిటిషన్లో ప్రతివాదులుగా.. ఏపీ స్పీకర్, కార్యదర్శి, శాసనసభ వ్యవహారాల మంత్రిని చేర్చారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి