AP Ex CM Jagan: అసెంబ్లీకి రాను.. జగన్ సంచలన నిర్ణయం!

రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం జగన్ హాజరుకావడం లేదు. రేపు సొంత నియోజకవర్గం పులివెందులకు ఆయన వెళ్లనున్నారు. కీలకమైన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉన్న నేపథ్యంలో జగన్ సభకు హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది.

New Update
AP Ex CM Jagan: అసెంబ్లీకి రాను.. జగన్ సంచలన నిర్ణయం!

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత జగన్ తొలిసారి పులివెందుల వెళ్తుండడంతో ఆయన పర్యటనకు ప్రాధాన్యత నెలకొంది. మూడు రోజుల పాటు జగన్ పులివెందులలోనే ఉండనున్నారు. రాయలసీమలోని ముఖ్య నేతలు, కార్యకర్తలతో జగన్ ఈ మూడు రోజుల పాటు సమావేశం కానున్నారు. అండగా ఉంటానని.. అధైర్య పడొద్దని జగన్ వారిలో భరోసా నింపే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్లోనే ఉండేలా జగన్ ఇక్కడి నుంచే ప్లాన్ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రేపు అసెంబ్లీలో కీలకమైన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉండనుంది. ఈ నేపథ్యంలో జగన్ సభకు హాజరుకావడం లేదన్న అంశం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. భవష్యత్ లోనూ ఆయన సభకు వస్తారా? రారా? అన్న విషయంలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

publive-image

ఇదిలా ఉంటే.. ఏపీ అసెంబ్లీలో ఈ మంత్రుల తర్వాత జగన్ ప్రమాణస్వీకారం చేశారు. చంద్రబాబుతో సహా సభ్యులందరికీ జగన్ అభివాదం చేశారు. సీఎం చంద్రబాబు జగన్‌కు ప్రతి నమస్కారం చేశారు. జగన్ ప్రమాణ స్వీకారం సమయంలో ఆయన ముఖ కవళికలను సీఎం ఆసక్తిగా గమనించినట్లు తెలుస్తోంది. జగన్ సభలోకి వచ్చి కూర్చోగానే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆయన దగ్గరకెళ్లి నమస్కరించారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్ వద్దకు వెళ్లిన మంత్రి సత్యకుమార్ చేతులు కలిపారు.  అయితే.. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే జగన్ సభ నుంచి వెళ్లిపోయారు. సభలో ఉన్నంతసేపు జగన్ ముభావంగా కనిపించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు